Argan Oil For Hair : ఆర్గాన్ ఆయిల్ తో అనేక లాభాలని పొందవచ్చు. చాలామందికి ఆర్గాన్ ఆయిల్ గురించి కానీ, ఆర్గాన్ ఆయిల్ కలిగే లాభాల గురించి కానీ తెలీదు. ఆర్గాన్ ఆయిల్ వలన, ఏఏ సమస్యలు దూరం అవుతాయి అనేది తెలుసుకుందాం. ఆర్గాన్ ఆయిల్ వలన చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి. ఆర్గాన్ ఆయిల్ రుచి కూడా చాలా బాగుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్గాన్ ఆయిల్ ని ఉపయోగించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ ఆయిల్ వలన ఔషధ ప్రయోజనంతో పాటుగా, సౌందర్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
ఈ ఆర్గాన్ ఆయిల్ వల్ల కలిగే లాభాలు ఏంటి అనే విషయానికి వస్తే… ఆర్గాన్ ఆయిల్ లో విటమిన్ ఈ ఎక్కువ ఉంటుంది. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా ఇది పనిచేస్తుంది. ఫ్రీ రాడికల్స్ హాని నుండి, మనల్ని బయట పారేస్తుంది. గాయాలు లేదా ఇన్ఫెక్షన్లు వంటివి కలిగినప్పుడు ఈ నూనె ని చర్మానికి రాస్తే మంచిది. ఆర్గాన్ ఆయిల్ తో గుండె ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు.
ఆర్గాన్ ఆయిల్ లో ఒలిక్ యాసిడ్ ఉంటుంది. మోనోసాచ్యురేటెడ్, ఒమేగా 9 వంటివి ఇందులో ఉంటాయి. ఆర్గాన్ ఆయిల్ గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గించగలదు. ఒక నెలరోజుల పాటు 15 గ్రాముల ఆర్గాన్ ఆయిల్ తీసుకున్నట్లయితే, చెడు కొలెస్ట్రాల్ 16% తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ట్రైగ్లిజరైడ్ స్థాయిలు అయితే, 20 శాతం వరకు తగ్గుతాయి. గాయం ఉన్నచోట ఆర్గాన్ ఆయిల్ ని రాయడం వలన, సులభంగా గాయం మానిపోతుంది.
చర్మ సంరక్షణ కి కూడా ఆర్గాన్ ఆయిల్ బాగా పనిచేస్తుంది. చర్మంపై ఆర్గాన్ ఆయిల్ రాయడం వలన, చర్మం ని బాగా రిపేర్ చేస్తుంది. వృద్ధాప్య ఛాయాలని రాకుండా చూస్తుంది కూడా. జుట్టుకి కూడా ఈ ఆయిల్ ని మనం రాసుకోవచ్చు. జుట్టుకి ఆర్గాన్ ఆయిల్ రాస్తే, జుట్టు బాగా ఎదుగుతుంది. స్కాల్ప్ ఆరిపోదు. జుట్టు రాలడం తగ్గుతుంది. తలకి తేమని ఇస్తుంది. అలానే, చర్మానికి కూడా ఇది తేమని ఇస్తుంది. ఇలా, అనేక లాభాలని మనం ఆర్గాన్ ఆయిల్ తో పొందవచ్చు.