వేసవి కాలం వచ్చిందంటే చాలు మనకు మార్కెట్లో మామిడి పండ్లు కనిపిస్తాయి. బాగా పండిన మామిడి పండ్లను తినడానికి ఎంతో మంది ఇష్టపడతారు. కానీ పచ్చి మామిడి కాయతో పప్పు చేసి వేడివేడి అన్నంలోకి తింటే ఆ రుచి వర్ణణాతీతం. మామిడికాయ పప్పును చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో ఇష్టంగా తింటారు. మరి అంత రుచికరమైన మామిడికాయ పప్పు తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం…
*పచ్చిమామిడికాయ ఒకటి
*కందిపప్పు ఒక కప్పు
*టమోటాలు మూడు
*పచ్చిమిర్చి15
*ఉప్పు తగినంత
*పసుపు చిటికెడు
*కొత్తిమిర
*తగినంత నీరు
*1/2టేబుల్ స్పూన్ ఆవాలు
*1/2 జీలకర్ర
*1/2 ధనియాలు
*ఉల్లిపాయ ముక్కలు
*వెల్లుల్లి రెబ్బలు
*పచ్చి కరివేపాకు
*ఎండు మిర్చి 2
* నూనె 3 టేబుల్ స్పూన్లు
ముందుగా పచ్చి మామిడికాయ తొక్క మొత్తం తీసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. కంది పప్పు, పర్చిమిర్చి,టమాటాలు,మామిడి ముక్కలు, కొత్తిమీర పసుపు,తగినంత నీరు కుక్కర్ లో వేసి మూడు విజిల్స్ వచ్చే వరకు పెట్టాలి. మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ వెళ్లిన తరువాత రుచికి సరిపడా ఉప్పు వేసి పప్పును బాగా రామాలి.
స్టౌవ్ పై మరో కడాయిను ఉంచి కొద్దిగా నూనె వేయాలి.నూనె వేడి అయిన తరువాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు,ధనియాలు, ఉల్లిపాయ ముక్కలు, వెళ్లులి వేసి బాగా మగ్గనివ్వాలి.ఆవాలు చిటపట అనగానే పోపును ముందుగా రామి పెట్టుకున్న పప్పులో వేయాలి. దీంతో ఎంతో రుచికరమైన పచ్చి మామిడి కాయ పప్పు రెడీ.ఈ పప్పును వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసి తింటే ప్లేట్ కాళీ కావాల్సిందే.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…