వేసవికాలం వచ్చిందంటే మనకు మార్కెట్లో మామిడి పండ్లు దర్శనమిస్తాయి. మామిడి పండ్లతో వివిధ రకాల వంటలను తయారు చేసుకొని తింటుంటారు. ఈ క్రమంలోనే కొందరు జ్యూస్ లు, పచ్చడిలు చేసుకుంటారు. అయితే ఈ మామిడి పండ్లతో పాపడ్ తయారుచేసుకుని తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి. ఈ మ్యాంగో పాపడ్ తినడానికి పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో ఇష్టపడుతుంటారు. మరి మ్యాంగో పాపడ్ ఏవిధంగా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
*బాగా పండిన మామిడికాయ గుజ్జు ఒక కప్పు
*చక్కర అర కప్పు
*నెయ్యి మూడు టేబుల్ స్పూన్లు
*మిరియాల పొడి టేబుల్ స్పూన్
ముందుగా నెయ్యిని మూడు పెద్ద ప్లేట్లకు రాసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులోకి మామిడి గుజ్జు పంచదార వేసుకొని చిన్న మంటపై బాగా కలియబెడుతూ ఉండాలి. ఈ మిశ్రమంలోకి నీరు వేయకుండా ఈ మిశ్రమం మొత్తం దగ్గర పడేవరకు కలియబెడుతూ ఉండాలి. ఈ విధంగా ఈ మిశ్రమంలోకి మిరియాల పొడి వేసి మిశ్రమం మొత్తం దగ్గరకు రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టాఫ్ చేసిన వెంటనే ఈ మిశ్రమాన్ని ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లలో వేసి ప్లేట్ మొత్తం సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత ఈ మిశ్రమం చల్లారగానే దీనిని ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…