మరికొన్ని రోజులలో శ్రావణమాసం రావడంతో లక్ష్మీదేవికి పెద్ద ఎత్తున పూజలు చేస్తారు. ఈ క్రమంలోనే అమ్మవారికి వివిధ రకాల స్వీట్లను తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తాము. ఈ క్రమంలోనే కోవా కోకనట్ బర్ఫీ ఏ విధంగా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
*కొబ్బరి తురుము ఒక కప్పు
*కోవా ఒక కప్పు
*చిక్కని పాలు ఒక కప్పు
*మిల్క్ పౌడర్ ఒక స్పూన్
*చక్కెర ఒక కప్పు
*యాలకులు 4
*నెయ్యి కొద్దిగా
తయారీ విధానం
స్టవ్ మీద పాన్ పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి ముందుగా కలిపి పెట్టుకున్న కొబ్బరి తురుము వేసి రెండు నిముషాల పాటు వేయించుకోవాలి. అదేవిధంగా స్టవ్ మీద మరొక పాన్ పెట్టి అందులోకి కోవా, చక్కెర వేసి చిన్నమంటపై కలియబెడుతూ చక్కెరను కరిగించుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో కి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము, పాలు, మిల్క్ పౌడర్ వేయాలి. చిన్నమంటపై ఈ మిశ్రమం మొత్తం చిక్కగా వచ్చే వరకు కలియబెడుతూ ఉండాలి. చివరికి ఈ మిశ్రమం పై యాలకుల పొడిని చల్లుకోవాలి. ఇప్పుడు ఒక ఒక వెడల్పాటి ప్లేట్ పై రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి మొత్తం పూయాలి.ఈ ప్లేట్ లోకి తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమం వేసి మనకు కావలసిన ఆకారంలో అయినా కట్ చేసుకోవచ్చు, లేదా చిన్న సైజు లడ్డూలుగా తయారు చేసుకుని తినవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్న స్వీట్లను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.