సాధారణంగా పకోడిని ఎన్నో రకాలుగా మనం చేసుకోవచ్చు. ఒక్కో విధమైన పదార్థాలతో చేసుకున్నప్పుడు ఒక్కో విధమైన రుచిని ఆస్వాదించవచ్చు. అయితే ఇప్పుడు మనం ఎంతో క్రిస్పీగా.. నోరూరించే పన్నీర్ పకోడీ ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
*పన్నీర్ రెండు కప్పులు(క్యూబ్ షేప్)
*పెరుగు రెండు టేబుల్ స్పూన్లు
*కార్న్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు
*ఉప్పు తగినంత
*కారం టేబుల్ స్పూన్
*కొత్తిమీర తురుము టేబుల్ స్పూన్
*పుదీనా తురుము టేబుల్ స్పూన్
*చికెన్ మసాలా అర టేబుల్ స్పూన్
*ఫుడ్ కలర్ (అవసరమైతే)
*నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత
*శెనగపిండి ఒక కప్పు
తయారీ విధానం
ముందుగా ఒక గిన్నెలో పన్నీర్ తీసుకొని అందులోకి పెరుగు, కార్న్ పౌడర్, కారం, ఉప్పు, కొత్తిమీర తురుము, పుదీనా, చికెన్ మసాలా వేసి బాగా కలుపుకోనీ ఒక గంట పాటు ఫ్రిజ్ లో పెట్టాలి. ఒక గంట తర్వాత కడాయిలో నూనె వేసి వేడి చేయాలి . తర్వాత ఒక గిన్నెలో శనగపిండి మనం పకోడీకి కలిపినట్లుగానే కలుపుకోవాలి. నూనె బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత పకోడీల మాదిరిగా నూనెలో వేసుకొని బాగా ఎర్రగా అయిన తర్వాత తీసేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటాయి.