మాంసాహారం

రంజాన్ స్పెషల్: హోమ్ మేడ్ మటన్ హలీమ్ తయారీ విధానం!

పరిచయం: ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ పండుగకు ఎంతో ప్రత్యేకమైనది హలీమ్. ముస్లింల పవిత్ర మాసం రంజాన్ నెల మొత్తం హలీమ్ కి ఎంతో డిమాండ్ ఉంటుంది. కేవలం ముస్లిమ్స్ మాత్రమే కాకుండా హిందువులు సైతం హలీమ్ తినడానికి ఇష్టపడుతుంటారు. మరి రంజాన్ స్పెషల్ హలీమ్ ఏ విధంగా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

  • బోన్ లెస్ మటన్-500grms
  • నెయ్యి అరకప్పు
  • జీలకర్ర టేబుల్ టీ స్పూన్
  • మిరియాలు టేబుల్ టీ స్పూన్
  • ఒక కప్పు పెరుగు
  • గోధుమరవ్వ ఒకటిన్నర కప్పు
  • సెనగపప్పు ఒక టీ స్పూన్
  • పెసరపప్పు ఒక టీ స్పూన్
  • ఎర్ర పప్పు ఒక టీ స్పూన్
  • పసుపు ఒక టీస్పూన్
  • దాల్చిన చెక్క 1
  • లవంగాలు 3
  • యాలకులు 5
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు
  • నిమ్మకాయ 1
  • నాలుగు పచ్చిమిర్చి ముక్కలు
  • కొత్తిమీర పుదీనా ఒక కట్ట
  • గరం మసాలా
  • ఉప్పు తగినంత
  • నీళ్లు 12 కప్పులు
  • ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు

తయారీ విధానం:

హోమ్ మేడ్ మటన్ హలీమ్ తయారు చేసుకోవడానికి ముందుగా కావలసిన పదార్థాలు అన్నింటిని సిద్ధంగా ఉంచుకోవాలి. హలీమ్ తయారు చేసుకోవడానికి ముందు రోజు రాత్రి శనగపప్పు, పెసరపప్పు ఎర్ర పప్పు ను బాగా కడిగి నానబెట్టుకోవాలి. తరువాత మటన్ వేసి బాగా శుభ్రం చేసి అందులో పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు కప్పుల నీటిని వేసి కుక్కర్లో పది విజిల్స్ వచ్చేవరకు పెట్టాలి.పది విజిల్స్ వచ్చిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి ప్రజర్ పోయిన తరువాత మటన్ ను మిక్సీలో బాగా మెత్తగా గ్రైండ్ చేయాలి.

తరువాత ముందుగా నానబెట్టిన పప్పులన్నింటిని ఒక గిన్నెలో వేసి బాగా ఉడికించాలి. పప్పులు పడుతుండగానే పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసి పది కప్పుల నీటిని వేసి బాగా ఉడికించాలి. ఉడికిన వీటిని బాగా మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి ప్యూరీలా  తయారు చేయాలి.మరొక పాన్లో కొద్దిగా నెయ్యి వేసి ముందుగా కట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు ఎరుపురంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్ పై మరొక పాన్ పెట్టుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి అయిన తర్వాత ముందుగా రోడ్డు పెట్టుకున్న మటన్ వేసి మూడు నిమిషాలు వేగనివ్వాలి. ఆ తర్వాత గోధుమ రవ్వ పప్పుని రుబ్బిన ప్యూరీని వేసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమం బాగా ఉడికి నెయ్యి పైకి తేలినప్పుడు ముందుగా వేయించుకున్న ఉల్లిపాయలను వేయాలి. దీనిలోకి నిమ్మరసం వేసి బాగా కలియబెట్టి తే తే ఎంతో ఇష్టమైన హోం మేడ్ హలీమ్ తయారైనట్లే. తరువాత స్టవ్ ఆపేసి ముందుగా తరిగిన అల్లం ముక్కలు కొత్తిమీర పుదీనా తరుగు హలీం పైన చల్లుకొని వడ్డిస్తే ఎంతో రుచిగా ఉంటుంది.

Share
Sailaja N

Recent Posts

ఈ ఫుడ్ తింటే ఊపిరితిత్తులు నెల రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా మారుతాయి..!

మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్య‌మైన‌వో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…

Monday, 23 September 2024, 5:22 PM

రోడ్డుపై కుక్క‌లు మిమ్మ‌ల్ని వెంబ‌డిస్తే ఆ స‌మ‌యంలో ఏం చేయాలి అంటే..?

ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మ‌రింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…

Saturday, 21 September 2024, 3:01 PM

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM