పరిచయం: ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ పండుగకు ఎంతో ప్రత్యేకమైనది హలీమ్. ముస్లింల పవిత్ర మాసం రంజాన్ నెల మొత్తం హలీమ్ కి ఎంతో డిమాండ్ ఉంటుంది. కేవలం ముస్లిమ్స్ మాత్రమే కాకుండా హిందువులు సైతం హలీమ్ తినడానికి ఇష్టపడుతుంటారు. మరి రంజాన్ స్పెషల్ హలీమ్ ఏ విధంగా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
- బోన్ లెస్ మటన్-500grms
- నెయ్యి అరకప్పు
- జీలకర్ర టేబుల్ టీ స్పూన్
- మిరియాలు టేబుల్ టీ స్పూన్
- ఒక కప్పు పెరుగు
- గోధుమరవ్వ ఒకటిన్నర కప్పు
- సెనగపప్పు ఒక టీ స్పూన్
- పెసరపప్పు ఒక టీ స్పూన్
- ఎర్ర పప్పు ఒక టీ స్పూన్
- పసుపు ఒక టీస్పూన్
- దాల్చిన చెక్క 1
- లవంగాలు 3
- యాలకులు 5
- అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు
- నిమ్మకాయ 1
- నాలుగు పచ్చిమిర్చి ముక్కలు
- కొత్తిమీర పుదీనా ఒక కట్ట
- గరం మసాలా
- ఉప్పు తగినంత
- నీళ్లు 12 కప్పులు
- ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు
తయారీ విధానం:
హోమ్ మేడ్ మటన్ హలీమ్ తయారు చేసుకోవడానికి ముందుగా కావలసిన పదార్థాలు అన్నింటిని సిద్ధంగా ఉంచుకోవాలి. హలీమ్ తయారు చేసుకోవడానికి ముందు రోజు రాత్రి శనగపప్పు, పెసరపప్పు ఎర్ర పప్పు ను బాగా కడిగి నానబెట్టుకోవాలి. తరువాత మటన్ వేసి బాగా శుభ్రం చేసి అందులో పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు కప్పుల నీటిని వేసి కుక్కర్లో పది విజిల్స్ వచ్చేవరకు పెట్టాలి.పది విజిల్స్ వచ్చిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి ప్రజర్ పోయిన తరువాత మటన్ ను మిక్సీలో బాగా మెత్తగా గ్రైండ్ చేయాలి.
తరువాత ముందుగా నానబెట్టిన పప్పులన్నింటిని ఒక గిన్నెలో వేసి బాగా ఉడికించాలి. పప్పులు పడుతుండగానే పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసి పది కప్పుల నీటిని వేసి బాగా ఉడికించాలి. ఉడికిన వీటిని బాగా మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి ప్యూరీలా తయారు చేయాలి.మరొక పాన్లో కొద్దిగా నెయ్యి వేసి ముందుగా కట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు ఎరుపురంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ పై మరొక పాన్ పెట్టుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి అయిన తర్వాత ముందుగా రోడ్డు పెట్టుకున్న మటన్ వేసి మూడు నిమిషాలు వేగనివ్వాలి. ఆ తర్వాత గోధుమ రవ్వ పప్పుని రుబ్బిన ప్యూరీని వేసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమం బాగా ఉడికి నెయ్యి పైకి తేలినప్పుడు ముందుగా వేయించుకున్న ఉల్లిపాయలను వేయాలి. దీనిలోకి నిమ్మరసం వేసి బాగా కలియబెట్టి తే తే ఎంతో ఇష్టమైన హోం మేడ్ హలీమ్ తయారైనట్లే. తరువాత స్టవ్ ఆపేసి ముందుగా తరిగిన అల్లం ముక్కలు కొత్తిమీర పుదీనా తరుగు హలీం పైన చల్లుకొని వడ్డిస్తే ఎంతో రుచిగా ఉంటుంది.