Masala Tea : ప్రతి ఒక్కరు కూడా, టీ ని ఇష్టపడుతూ ఉంటారు. టీ, కాఫీలు ని చాలామంది ఎక్కువసార్లు రోజుల్లో తీసుకుంటూ ఉంటారు. టీ, కాఫీ తీసుకుంటే, ఏదో తెలియని ఎనర్జీ మనలో వస్తుంది. అధిక మోతాదులో తీసుకుంటే, ఆరోగ్యానికి ఇబ్బంది. కానీ లిమిట్ గా తీసుకుంటే ఎటువంటి నష్టం ఉండదు. అయితే, ఇలా కనుక మీరు టీ ని తయారు చేశారంటే కచ్చితంగా ఇంట్లో వాళ్ళు ఇంప్రెస్ అయిపోతారు. మంచి రంగు, రుచి, వాసన కలిగిన టీ ఇది. టీ ని ఎలా తయారు చేసుకోవాలి..? ఎలా ఇంట్లో వాళ్ళని ఫిదా చేసేయాలి అనే విషయాన్ని ఇప్పుడు చూసేద్దాం.
పాలు బాగా మరిగేంత వరకు కూడా లో ఫ్లేమ్ లో పెట్టి, పాలను బాగా మరిగించండి. ఆ తర్వాత పాలను తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె పొయ్యి మీద పెట్టి, రెండు కప్పులు నీళ్లు పోసుకోండి. నీళ్లు బాగా మరిగేంత వరకు మూత పెట్టి, మరిగించుకోండి. చెక్కు తీసిన అల్లాన్ని కొంచెం దంచేసి వేసుకోండి. ఒక నాలుగు, ఐదు యాలకులను కూడా ఈ నీళ్లలో వేసేయండి. ఒక నాలుగు లవంగాలని కూడా వేసుకోండి.
కొంచెం దాల్చిన చెక్కను కూడా వేసుకోండి. అలానే మూడు టేబుల్ స్పూన్ల వరకు పంచదారని వేసుకోండి. రెండు టేబుల్ స్పూన్ల టీ పొడి కూడా వేసుకోండి. టీ పొడి వేసాక మూత పెట్టేసుకోండి. బాగా తయారవుతుంది. ఇది బాగా మరిగిన తర్వాత, కాచిన పాలని రెండు కప్పులు పోసుకోవాలి.
పాలు వేసేటప్పుడు చల్లటి పాలని ఎప్పుడూ మిక్స్ చేయకండి. గోరువెచ్చని పాలు నయినా తీసుకోవచ్చు. కానీ, చల్లటి పాలని తీసుకోవద్దు. ఇది మరిగించుకున్నాక, గులాబీ రేకుల్ని వేసుకోండి, ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మరిగించుకోండి. తర్వాత ఒక గరిటను తీసుకుంటూ కలుపుతూ మళ్ళీ మరిగించుకోండి. ఇక, వడకట్టుకుని వేడివేడిగా టీ ని ఆస్వాదించడమే.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…