Jowar Idli : చిరు ధాన్యాలను తినడం వల్ల ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. చిరు ధాన్యాలు మనకు ఎంతగానో మేలు చేస్తాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అయితే చిరు ధాన్యాల్లో ఒకటైన జొన్నలను తినడం వల్ల మనం ఎన్నో లాభాలను పొందవచ్చు. వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో వ్యాధులను తగ్గించుకోవచ్చు. జొన్నలను వివిధ రూపాల్లో తీసుకోవచ్చు. దీంతో ఎంతో మేలు జరుగుతుంది.
మనలో చాలా మంది ఇడ్లీల తినడానికి ఆసక్తిని చూపిస్తుంటారు. కానీ ఆ ఇడ్లీలను తింటే పిండి పదార్థాలు ఎక్కువగా లభిస్తాయి. దీంతో షుగర్ వచ్చే చాన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు చెప్పే జొన్న ఇడ్లీలను తింటే మాత్రం ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం. మినప పప్పు లేదా మినప గుళ్ళను ఒక కప్పు మోతాదులో తీసుకుని నీటిలో నానబెట్టాలి. రెండు కప్పుల జొన్న రవ్వను కూడా నీటిలో వేసి నానబెట్టాలి. ఈ రెండింటినీ సుమారు ఆరు గంటల పాటు నానబెట్టాలి. మినప పప్పును శుభ్రంగా కడిగి రుబ్బుకోవాలి. దీనిలో నానబెట్టిన జొన్న రవ్వను, ఉప్పును వేసి బాగా కలిపి ఆరు గంటలు అలా వదిలేయాలి. ఆ తర్వాత ఇడ్లీ వేసుకొని తినవచ్చు. ఈ జొన్న ఇడ్లీలను వారంలో మూడు సార్లు తినాలి. దీంతో డయబెటిస్, అధిక బరువు ఉన్నవారికి ఎంతో మేలు చేస్తాయి.
జొన్నల్లో ఉన్న సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్స్ నెమ్మదిగా జీర్ణమవుతాయి. దాంతో రక్తంలో చక్కెర శాతం కూడా నెమ్మదిగా పెరుగుతుంది. అందుకనే జొన్నలు బరువు తగ్గే ప్రణాళిక ఉన్నవారికి, డయాబెటిస్ ఉన్నవారికి మంచి ఎంపిక అని చెప్పవచ్చు. మన శరీరానికి అవసరమైన ప్రోటీన్ కూడా అందుతుంది. ఫైబర్ సమృద్దిగా ఉండడం వల్ల చెడు కొలెస్ట్రాల్ లేకుండా చేస్తుంది. అలాగే గుండెను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. జొన్నలలో విటమిన్ B6 సమృద్దిగా ఉండడం వలన రోజంతా అలసట, నీరసం లేకుండా హుషారుగా ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఇలా జొన్నలను ఇడ్లీల రూపంలో తింటే ఎంతో మేలు పొందవచ్చు. అయితే జొన్నలను ఇడ్లీలుగా మాత్రమే కాకుండా.. ఉప్మా, గటక, రొట్టెల రూపంలోనూ తీసుకోవచ్చు. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…