దేశంలో రోజుకు 2.50 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఇలా జరగడం వరుసగా 5వ రోజు. అనేక రాష్ట్రాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీంతో కోవిడ్ హాట్‌స్పాట్‌లను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వాలు రాత్రి కర్ఫ్యూలు, లాక్‌డౌన్‌లు విధిస్తున్నాయి. అయితే కర్ఫ్యూకు, లాక్‌డౌన్‌కు మధ్య ఉన్న తేడాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కర్ఫ్యూ అంటే ప్రజలు అసలు రోడ్ల మీద తిరగకూడదు. నిర్దేశించినన్ని గంటలపాటు ఇంట్లోనే ఉండాలి. సాధారణంగా అల్లర్లు, ఉగ్రదాడులు వంటి సంఘటనలు జరిగినప్పుడు కర్ఫ్యూ విధిస్తుంటారు. ఇది కేవలం కొన్ని గంటల పాటు మాత్రమే ఉంటుంది. సమయం దాటితే కర్ఫ్యూను సడలిస్తారు. ఇక లాక్‌డౌన్ అంటే కర్ఫ్యూ కన్నా ఎక్కువ సమయం పాటు నిషేధాజ్ఞలు ఉంటాయి. రెండింటికీ దాదాపుగా ఒకే రకమైన పోలికలు ఉంటాయి. కానీ రెండూ వేర్వేరు అన్న విషయాన్ని గమనించాలి.
కర్ఫ్యూ విధిస్తే మార్కెట్లు, స్కూళ్లు, కాలేజీలు, ఇతర సేవలను ఏమాత్రం అనుమతించరు. కర్ఫ్యూ సమయంలో ప్రజలు కచ్చితంగా ఇళ్లలోనే ఉండాలి. కేవలం అత్యసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఇక లాక్‌డౌన్ విధిస్తే అన్ని ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, ప్రజా రవాణా పూర్తిగా నిలిపివేయబడతాయి. మహమ్మారి వ్యాధులకు సంబంధించి ఒకరి నుంచి మరొకరికి సోకకుండా వైరస్‌ను కట్టడి చేసేందుకు, వైరస్ చెయిన్‌ను బ్రేక్ చేసేందుకు లాక్‌డౌన్‌ను విధిస్తుంటారు. అందువల్లే చాలా రాష్ట్రాల్లోని నగరాల్లో లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు.
అయితే చూసేందుకు కర్ఫ్యూ, లాక్‌డౌన్ ఒక్కలాగే అనిపిస్తాయి. కానీ నిజానికి ఇవి రెండూ వేర్వేరు. కర్ఫ్యూ సమయంలో కేవలం అత్యవసర వైద్య సేవలను మాత్రమే అనుమతిస్తారు. అదే లాక్‌డౌన్ అయితే కొంత నిర్దిష్టమైన సమయం పాటు మార్కెట్లు, ఇతర అవసరమైన సేవలకు అనుమతిస్తారు. దీంతోపాటు అత్యసవర సేవలకు మినహాయింపులు ఉంటాయి. వైద్య సేవలకు అనుమతిస్తారు.
కర్ఫ్యూను కేవలం కొన్ని గంటల పాటు మాత్రమే అమలు చేస్తారు. లాక్‌డౌన్‌ను సుదీర్ఘకాలం అమలు చేస్తారు. లాక్ డౌన్, కర్ఫ్యూ దాదాపుగా సమానమే అయినప్పటికీ లాక్‌డౌన్ వల్లే కోవిడ్ ను పూర్తిగా కట్టడి చేయగలుగుతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. రాత్రి కర్ప్యూ విధించడం వల్ల ప్రయోజనం ఉండదని అంటున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…