రక్తదానం ఎంత అవసరమో ప్రతి ఒక్కరికి తెలిసినదే. అయితే ప్రస్తుతం రక్త దానం చేయాలంటే ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. కరోనా బారినపడి కోలుకున్న తర్వాత రక్త దానం చేయవచ్చా?వ్యాక్సిన్ వేయించుకున్నాక రక్త దానం చేస్తే ఎటువంటి సమస్య లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి ప్రశ్నలకు నిపుణులు ఏమంటున్నారంటే…
అమెరికన్ రెడ్ క్రాస్ మరియు ఇనోవా బ్లడ్ డోనర్స్ సర్వీసెస్ చెప్పిన దాని ప్రకారం రక్త దానం చేయొచ్చు. అదేవిధంగా వ్యాక్సిన్ చేయించుకున్న తర్వాత ప్లాస్మా కూడా దానం చేయవచ్చునని చెబుతున్నారు. కానీ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ గైడెన్స్ ప్రకారం రక్తదానం, ప్లాస్మా దానం చేయకూడదని చెబుతున్నారు.
ఒకవేళ బ్లడ్ డొనేట్ చేయాలనుకునేవారు బ్లడ్ డొనేట్ చేసే సమయంలో మీ వ్యాక్సిన్ కార్డ్ మీ వెంట తీసుకెళ్లాలి.Pfizer, Moderna or J&J vaccines వేయించుకున్న వాళ్లు ఎమర్జెన్సీ సమయంలో బ్లడ్ డొనేట్ చేయవచ్చు.ఆస్ట్రాజెనికా మరియు నోవావెక్స్ వేయించుకున్న వారికి మరిన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది.ఇనోవా మాత్రం వ్యాక్సిన్ వేయించుకున్న సంవత్సరం వరకు రక్తదానం చేయక పోవడం మంచిదని తెలియజేస్తోంది. ఏది ఏమైనా రక్తదానం చేసే ముందు ఒకసారి వైద్యుని సంప్రదించి బ్లడ్ డొనేట్ చేయవచ్చు.