కలలు అనేవి ప్రతి ఒక్కరికీ వస్తుంటాయి. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా కలలు కంటారు. రాత్రి లేదా పగలు ఎప్పుడు నిద్రించినా సరే కలలు వస్తాయి. ఇక కొందరికి తరచూ పీడకలలు వస్తాయి. కొందరికి సాధారణ కలలు వస్తాయి. ఈ క్రమంలోనే కలలకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. సాధారణంగా ఒక వ్యక్తికి రోజూ సగటున 4 నుంచి 7 కలలు వస్తాయి. కానీ ఉదయం నిద్ర లేచేసరికి 90 శాతం కలలు మనకు గుర్తుండవు. ఇక ఒక్కో కల సుమారుగా 5 నిమిషాల పాటు వస్తుంది.
2. ప్రతి ఒక్కరికీ కలలు వస్తాయి. అంధులు కూడా కలలు కంటారు.
3. కలల్లో మనకు తెలిసిన వారి ముఖాలే కనిపిస్తాయి. కొత్త ముఖాలు కనిపించవు. ఎందుకంటే మన మెదడు కొత్త ముఖాలను ఊహించుకోలేదు.
4. కలలన్నీ కలర్‌లో ఉండవు. బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటాయి. కొందరికి కలర్‌లో కనిపిస్తాయి. దృష్టి లోపం ఉండే వారిలో కలలు బ్లాక్ అండ్ వైట్‌లో వస్తాయి.
5. పురుషుల కలల్లో సహజంగా పురుషులే ఎక్కువగా కనిపిస్తారు. సుమారుగా 70 శాతం మంది పురుషుల కలల్లో ఇతర పురుషులు కనిపిస్తారు. అయితే స్త్రీలు కనే కలల్లో స్త్రీలు, పురుషులు ఇద్దరూ కనిపిస్తారు.
6. గురక బాగా పెట్టే వారికి కలలు తక్కువగా వస్తాయి. లేదా కలలు అస్సలు రావు.
7. మనుషులకే కాదు కొన్ని జంతువులకు కూడా కలలు వస్తాయి.
8. మెళకువగా ఉన్నప్పటి కన్నా మనం కలలు కనేటప్పుడే మన మెదడు యాక్టివ్‌గా ఉంటుంది.
9. మనం చదువుతున్నట్లు కలలు రావు. లేదా అతి స్వల్పంగా వస్తాయి.
10. ప్రపంచంలో కొన్ని వర్గాలకు చెందిన వారు స్పృహలో ఉండే కలలు కనే విధానాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇది దాదాపుగా అసాధ్యమనే చెప్పవచ్చు. అయితే దీని ద్వారా వారు గాలిలో ఎగరడం, గోడల మధ్య నుంచి దూసుకెళ్లడం, కాలంలో ముందుకు లేదా వెనక్కి వెళ్లడం సాధ్యమవుతుందని నమ్ముతున్నారు. కానీ దీన్ని ఇంత వరకు ఎవరూ సాధించలేదు.