ముఖ్య‌మైన‌వి

నైట్ వాచ్ మెన్ నుంచి ఐఐఎం ప్రొఫెసర్ గా కేరళ యువకుడు..!

ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురవుతుంటాయి. అయితే ఆ కష్టాలను ఎదుర్కొని మన ప్రయత్నం మనం చేసినప్పుడే అంతిమంగా విషయాన్ని పొందుతాము. ఈ విధంగా ఎన్నో కష్టాలని ఎదుర్కొని మంచి స్థానంలో ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారు ఎంతో మందికి స్ఫూర్తి దాయకంగా నిలుస్తారు. ఇలాంటి స్ఫూర్తి ఒక నైట్ వాచ్ మెన్ గా పని చేసే యువకుడిని అసిస్టెంట్ ప్రొఫెసర్ ను చేసింది.

కేరళకు చెందిన రంజిత్‌ రామచంద్రన్‌ కష్టాలకు కుంగిపోకుండా, చదువుపై ఉన్న శ్రద్ధతో, తన చదువుకు తన పేదరికం అడ్డురాకుడదని రాత్రిపూట టెలిఫోన్ ఎక్స్చేంజ్ వద్ద వాచ్ మెన్ విధులను నిర్వహిస్తూ, ఉదయం కాలేజీకి వెళ్లి చదువుకుంటూ.. తన కష్టాలతో ఎదురీదాడు. ఆ కష్టమే ఇప్పుడు అతని అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థానంలో నిలబెట్టింది. ఐఐఎం రాంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న 28 ఏళ్ల రంజిత్ తన వివరాలను ఫేస్ బుక్ ద్వారా పంచుకున్నారు.

రంజిత్ కాసర్‌గఢ్‌ పీయూస్ కాలేజీ నుంచి ఎకనమిక్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు.రాత్రి పూట వాచ్ మెన్ గా చేస్తూ ఉదయం కాలేజీకి వెళ్లి చదువుకున్న రంజిత్ మంచి ఉత్తీర్ణత సాధించారు. గ్రాడ్యుయేషన్ తర్వాత ఐఐటీ మద్రాస్‌లో పీహెచ్‌డీ సీటు సంపాదించారు. కేవలం మలయాళం మాత్రమే వచ్చిన రంజిత్ ఇంగ్లిష్ పై పట్టు లేకపోవడంతో ఎంతో ఇబ్బంది పడ్డాడు.చివరికి పీహెచ్‌డీ కోర్సు మధ్యలోనే వదిలి రావాలని భావించినప్పుడు గైడ్‌ డాక్టర్‌ సుభాష్‌ సహకారంతో కోర్సు పూర్తి చేశారు. ‘కలలను సాకారం చేసుకోడానికి పోరాటం చేయాలనే పట్టుదలతో గత ఏడాది పీహెచ్ డీ కోర్సు పూర్తి చేసి డాక్టరేట్ పొందానని తెలిపారు.

డాక్టరేట్ పొందిన రంజిత్ రెండు నెలలు బెంగళూరు క్రిస్ట్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశానని పేర్కొన్నారు. తాజాగా ఐఐఎం రాంచీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ విషయాన్ని రంజిత్ ఫేస్ బుక్ ద్వారా పోస్ట్ చేయడంతో ఎంతో మంది లైక్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. రంజిత్ తన పోస్ట్ కు వచ్చిన స్పందన చూసి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నా పోస్ట్ వైరల్ అవుతుందని అనుకోలేదు కానీ..కొందరికైనా స్ఫూర్తిగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ పోస్ట్ చేసినట్లు తెలిపారు. రంజిత్ చేసిన ఈ పోస్ట్ కేరళ ఆర్థిక శాఖ మంత్రి స్పందించి అతనికి శుభాకాంక్షలు తెలియజేశాడు.

Share
Sailaja N

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM