మనకు అందుబాటులో ఉండే అనేక రకాల గింజల్లో నువ్వులు కూడా ఒకటి. వీటిని కూరల్లో, పచ్చళ్లలో వేస్తుంటారు. నువ్వులలో అనేక పోషకాలు ఉంటాయి. నువ్వుల వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.
1. నువ్వుల్లో ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. మెగ్నిషియం కూడా ఎక్కువే.
2. నువ్వులను లేదా దాంతో తయారు చేసే నూనెను వాడడం హైబీపీ తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
3. నల్ల నువ్వుల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. వాటిని తీసుకుంటే ఐరన్ లోపం పోతుంది. రక్తహీనత తగ్గుతుంది.
4. నువ్వుల్లో సెసమాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. వాటిల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. అందువల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
5. నువ్వుల్లో ఉండే మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.
6. నువ్వుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. ఫైబర్ వల్ల రక్తనాళాలు, ఎముకలు, కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
7. నువ్వులను తీసుకుంటే ఆస్తమా తగ్గుతుంది. నువ్వుల్లో ఉండే కాల్షియం, జింక్‌లు ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశలు తక్కువగా ఉంటాయి.
8. నువ్వుల నూనెను వాడుతుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. వారానికి ఒకసారి నువ్వుల నూనెతో శరీరానికి మర్దనా చేసి స్నానం చేయాలి. దీంతో మనస్సు ప్రశాంతంగా మారడమే కాక, చర్మం సురక్షితంగా ఉంటుంది.
9. నువ్వుల నూనెను జుట్టుకు రాస్తుంటే శిరోజాలు ఒత్తుగా, దృఢంగా, ఆరోగ్యంగా పెరుగుతాయి. చుండ్రు తగ్గుతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…