గ్రీన్ ఆపిల్, కాశ్మీర్ ఆపిల్, కస్టర్డ్ ఆపిల్ గురించి వినే ఉంటాం కానీ.. వాటర్ ఆపిల్ గురించి ఎప్పుడు విని ఉండరు. ఈ వాటర్ ఆపిల్ శాస్త్రీయ నామం సిజియం సమరాంజెన్స్. దీనిని రోజ్ ఆపిల్, గులాబ్ జామూన్ కాయ అని కూడా పిలుస్తారు. తెలుగులో కమ్మరి కాయలు అని కూడా అంటారు. ఇది ఎక్కువగా ఇండోనేషియా, మలేషియా వంటి దేశాలలో అధికంగా పెరుగుతుంటాయి. కానీ ఇప్పుడు మన దేశంలో కూడా పెరుగుతున్నాయి.
ధర్మారం మండలం కటికెనపల్లికి చెందిన రైతు దంపతులు బల్ల లక్ష్మి, నర్సింగానికి గ్రామంలో మూడు ఎకరాల మామిడి తోటను సాగు చేస్తున్నారు. ఒక రోజు మామిడి మొక్కలు సరఫరా చేసే వ్యక్తి ఈ వాటర్ ఆపిల్ గురించి వారికి చెప్పాడు. దీంతో వారు ఆ మొక్కను తెప్పించి నాటగ కొద్దిరోజులకు అది ఎండిపోయింది. తరువాత మరొక మొక్క తెప్పించి ఎంతో జాగ్రత్తగా దానిని కాపాడి పెంచి పెద్ద చేశారు.
రెండు సంవత్సరాల తర్వాత ఆ చెట్టు పూత పిందెలు వేసి ప్రస్తుతం కాపు కాస్తుంది.లక్ష్మి దంపతులు ప్రతి ఐదు రోజులకు ఒకసారి ఈ కాయలను కోసి మార్కెట్ తీసుకెళ్తుంటారు.మార్కెట్లో వీటి ధర కిలో 100 నుంచి 150 రూపాయల వరకు పలుకుతుంది. ఒక సీజన్లో 2 క్వింటాళ్లకు పైబడి దిగుబడి అంటే తక్కువలో తక్కువ 26వేల ఆదాయం వస్తుందని ఆ రైతులు తెలిపారు. ఈ వాటర్ ఆపిల్ చూడటానికి గంట ఆకారంలో ఉండి ఎక్కువ భాగం నీరును కలిగి ఉంటుంది. అదేవిధంగా ఈ యాపిల్ లో పోషక పదార్థాలు కూడా అధికంగా ఉండడంతో మార్కెట్లో దీనికి ఎక్కువ డిమాండ్ ఏర్పడింది
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…