కరోనాతో హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్న బాధితులకు ఆక్సిజన్‌ను అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం దేశంలో పలు చోట్ల ఆక్సిజన్ కొరత కారణంగా పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆక్సిజన్ సరఫరాను పెంచేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇక విదేశాల నుంచి సైతం ఈ దిశగా సహాయం అందుతోంది. అయితే కరోనా వల్ల ఆక్సిజన్ సిలిండర్లకే కాదు, ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్‌లకు కూడా డిమాండ్ పెరిగింది. ఇంతకీ ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్ కంప్యూటర్ మానిటర్ కన్నా పెద్దదిగా ఉంటుంది. అయితే ఆక్సిజన్ సిలిండర్ ఎలాగో ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్ కూడా అలాగే పనిచేస్తుంది. కోవిడ్ బారిన పడి ఇంట్లో ఉండి చికిత్స తీసుకుంటున్న వారికి ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్‌లు మేలు చేస్తాయి. ఐసీయూల్లో చికిత్స తీసుకునే కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ సిలిండర్లు అవసరం అవుతాయి.
మన చుట్టూ ఉండే గాలిలో 78 శాతం వరకు నైట్రోజన్ ఉంటుంది. అలాగే 21 శాతం వరకు ఆక్సిజన్ ఉంటుంది. మిగిలిన 1 శాతం ఇతర వాయువులు ఉంటాయి. ఈ క్రమంలో ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్ మన పరిసరాల్లో ఉండే గాలిని గ్రహించి అందులోని నైట్రోజన్‌ను, ఆక్సిజన్‌ను వేరు చేస్తుంది. ఈ క్రమంలో ఆ పరికరం నుంచి నైట్రోజన్ బయటకు వెళ్తుంది. ఆక్సిజన్ అందులో ఉంటుంది. దాన్ని పేషెంట్లకు సరఫరా చేస్తారు.
ఇక సైంటిస్టులు చేసిన అధ్యయనాల ప్రకారం ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్‌ల నుంచి వచ్చే ఆక్సిజన్ 90 నుంచి 95 శాతం వరకు స్వచ్ఛతను కలిగి ఉంటుంది. దీని సహాయంతో రోజుకు 24 గంటలూ ఆక్సిజన్‌ను సరఫరా చేయవచ్చు. ఇక ఒక్క ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్ 5 ఏళ్ల వరకు నిరంతరాయంగా పనిచేయగలదు.
అయితే సిలిండర్ల ద్వారా అందే ఆక్సిజన్ 99 శాతం వరకు స్వచ్చతను కలిగి ఉంటుంది. ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్ ల ద్వారా విడుదలయ్యే ఆక్సిజన్ 95 శాతం వరకు స్వచ్ఛంగా ఉంటుంది. సిలిండర్ల ద్వారా పెద్ద మొత్తంలో ఆక్సిజన్‌ను సరఫరా చేయవచ్చు. కానీ ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్‌ల ద్వారా తక్కువ మొత్తంలో ఆక్సిజన్ విడుదల అవుతుంది. స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉండే వారికి నిమిషానికి 5-10 లీటర్ల ఆక్సిజన్ కావాలి. కనుక వారికి ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్‌లు సరిపోతాయి. అయితే ఐసీయూలో ఉండే కోవిడ్ బాధితులకు నిమిషానికి 40-50 లీటర్ల వరకు ఆక్సిజన్ అవసరం అవుతుంది. కనుక వారికి ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్‌లు సరిపోవు. సిలిండర్లు కావాలి.
ఈ క్రమంలోనే ఇంట్లో ఉండి చికిత్స తీసుకునే వారికి ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్‌లు సరిగ్గా సరిపోతాయి. కానీ హాస్పిటల్స్‌లో ఐసీయూలో ఉండే వారికి తప్పనిసరిగా ఆక్సిజన్ సిలిండర్లను పెట్టాలి. ఇవీ ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలు. అయితే ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్‌ల కన్నా సిలిండర్ల ధరే తక్కువ. కాన్‌సన్‌ట్రేటర్‌ల ధర సుమారుగా రూ.40వేల నుంచి రూ.90వేల వరకు ఉంటుంది. అదే సిలిండర్లు అయితే రూ.8వేల నుంచి రూ.20వేల మధ్యలో ధర ఉంటుంది. ఇక ఒకప్పుడు కాన్‌సన్‌ట్రేటర్‌లు ఏడాదికి 40వేలు అవసరం ఉండేవి. కానీ కరోనా వల్ల ఇప్పుడు నెలకు ఇవి 40వేలు అవసరం అవుతున్నాయి. అందువల్లే కాన్‌సన్‌ట్రేటర్‌లకు డిమాండ్ భారీగా పెరిగింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…