ముఖ్య‌మైన‌వి

రూ.10 ఫీజుతో కరోనా వైద్యం.. ఎక్కడంటే?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో మనకు తెలిసిందే. కేవలం సాధారణ దగ్గు జలుబు ఉన్నా కూడా ప్రవేట్ ఆసుపత్రులకు వెళితే కరోనా పేరు చెప్పి వైద్యపరీక్షల కోసం వేలల్లో డబ్బులు లాగుతున్నారు. అలాంటిది కరోనా వైరస్ సోకితే వారికి వైద్యం చేయించడానికి లక్షల రూపాయలను ప్రజల నుంచి వసూలు చేస్తున్న ఈ రోజుల్లో కేవలం పది రూపాయల ఫీజుతోనే కరోనా వైద్యానికి చికిత్స అందిస్తూ పేదల పాలిట దేవుడయ్యాడు.

పీర్జాదిగూడలో ప్రజ్వల క్లినిక్‌ నిర్వహిస్తున్న డాక్టర్‌ విక్టర్‌ ఇమ్మాన్యుయెల్‌ ఆదర్శమిది.జనరల్‌ మెడిసిన్‌ లో స్పెషలైజేషన్‌తో ఎంబీబీఎస్‌ చేసిన డాక్టర్ ఇమ్మాన్యుయేల్ వివిధ ఆస్పత్రులలో విధులు నిర్వహించి ప్రస్తుతం సొంతంగా ఒక క్లినిక్ నడుపుతున్నాడు. ఈ క్లినిక్ ప్రారంభించినప్పటి నుంచి డాక్టర్ విక్టర్ 200 రూపాయలు కన్సల్టేషన్ ఫీజు తీసుకునేవాడు. అయితే ఈ కరోనా విపత్కర పరిస్థితులలో ప్రతి ఒక్కరికి మంచి వైద్యం అందించాలన్న ఆరాటంలో కేవలం 10 రూపాయలకే కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

పది రూపాయల కన్సల్టేషన్ ఫీజు తీసుకొని కరోనా వైద్య పరీక్షలు, మందులు వంటి సౌకర్యాలను అందిస్తున్నారు. ఇక నిరుపేదలకు, దేశ రక్షణ కోసం పాటుపడే సైనికులకు, దేశానికి అన్నం పెట్టే రైతులకు ఉచితంగానే ఈ చికిత్సను అందిస్తున్నారు. కరోనా బారిన పడి ఆక్సిజన్ అవసరమయ్యే వారికి రెమ్‌డెవివిర్‌ వంటి ఇంజెక్షన్లను ఉపయోగించి ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రస్తుతం లక్షలలో డబ్బులు వసూలు చేస్తున్నారు. కానీ ఈ ఆస్పత్రిలో మాత్రం కేవలం 15 నుంచి 20 వేల రూపాయలతో మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్ తెలిపారు.

కరోనా బారిన పడి ఇంటి దగ్గరే వైద్యసేవలు తీసుకుంటున్న వారి కోసం తమ ఆసుపత్రి నుంచి ఇంటికి నర్సులను పంపుతూ చికిత్సనందిస్తున్నారు. అయితే నర్సుల రవాణా చార్జీలను రోగులు భరించాల్సి ఉంటుంది. బయట ఆస్పత్రులలో లక్షలు వసూలు చేసి అందిస్తున్న చికిత్సను డాక్టర్ ఇమ్మానియేల్ 20వేల రూపాయలు అందించడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకుంటున్నారు. ఇలాంటి కష్ట సమయాల లో డాక్టర్ ఉదారస్వభావంతో ఈ విధంగా వైద్యసేవలు అందించడం పట్ల డాక్టర్ ఇమ్మానియేల్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Share
Sailaja N

Recent Posts

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM

Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!

Devara Ticket Prices : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత న‌టించిన చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ…

Monday, 16 September 2024, 6:57 AM