Children Names : పిల్లలు పుట్టగానే కాదు.. తల్లిదండ్రులకు అసలు సమస్య ఎప్పుడు వస్తుందో తెలుసా..? వారికి పేర్లు పెట్టడంలో వస్తుంది. అవును, ఆ సమయంలోనే తల్లిదండ్రులు చాలా తర్జన భర్జన పడుతుంటారు. ఏం పేరు పెట్టాలి..? ఏం పేరు పెడితే బాగుంటుంది..? అన్న సందేహాలు వారిలో ఉత్పన్నమవుతాయి. ఈ క్రమంలోనే వారు ఇతరులను సలహాలు అడుగుతారు. పేర్ల పుస్తకాలు తిరగేస్తారు. వారు చెప్పింది, వీరు చెప్పింది వింటారు. చివరకు ఏదో ఒక పేరుకు ఫిక్సయి అదే పెడతారు. అయితే అలా పేరు పెట్టేలోపే నిక్ నేమ్ అప్పటికే చెలామణీలో ఉంటుంది కనుక పేరు పెట్టినా దాంతో పిలవరు. నిక్ నేమ్, ముద్దు పేర్లతోనే పిలుస్తారు. అయితే నిజానికి మీకు తెలుసా..? హిందూ శాస్త్రాల ప్రకారం పిల్లలకు పేర్లు ఎలా పెట్టాలో..? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
పిల్లలకు పేర్లు పెట్టడంలో కొన్ని నియమాలను శాస్త్రాలు సూచిస్తున్నాయి. అవేమిటంటే.. పిల్లలు పుట్టిన 11వ రోజున, 21వ రోజున, 26వ రోజున పేరు పెట్టాలి. వారి జన్మ నక్షత్రం, రాశి ప్రకారం పేరు పెట్టాలి. రుషులు, పర్వతాలు, నదులు, చెట్లు, రాక్షసులు, ఉగ్ర దేవతల పేర్లు పెట్టరాదు. మాతృభాషలోనే పేరు పెట్టాలి. సరళమైన పదాలు పేరులో ఉండాలి. కఠినమైన పదాలు ఉండరాదు. అంటే రెండో అక్షరాలతో వచ్చే పేర్లను పెట్టరాదు. ఉదాహరణకు.. ఖ, ఘ, ఛ, ఠ, ఢ, ణ, థ, ధ, ఫ, భ ఇలా అన్నమాట. ఇలా రెండో అక్షరంతో వచ్చే పేర్లను పెట్టరాదు. సరళంగా పదాలు ఉండాలి.
మగపిల్లలకు సరి సంఖ్యలో పదాలు వచ్చేలా పేర్లు పెట్టాలి. ఉదాహరణకు హరి, నారాయణ.. ఇలా అన్నమాట. ఆడపిల్లలకు బేసి సంఖ్యలో పదాలు వచ్చేలా పేర్లు పెట్టాలి. ఉదాహరణకు అనిత, సరిత, కవిత.. ఇలా అన్నమాట. దేవుళ్లు, దేవతల పేర్లను పిల్లలకు పెడితే వారిని పేరుతో దూషించరాదు. పెద్దవారి పేర్లను పిల్లలకు పెట్టినా వారిని తిట్టరాదు. అంతా బాగానే ఉంది. అయితే మగ పిల్లలకు సరి సంఖ్యలో, ఆడ పిల్లలకు బేసి సంఖ్యలో పదాలు వచ్చేలా పేర్లు ఎందుకు పెట్టాలి.. అందులో ప్రాముఖ్యత ఏముంది..? అంటే..
అవును ఉంది. నిజానికి లింగం ప్రకారం మనుషుల్లో ఆడ, మగ ఉన్నప్పటికీ ఆడవారిలో కొన్ని మగ లక్షణాలు ఉంటాయి. అలాగే మగవారిలో కొన్ని ఆడ లక్షణాలు ఉంటాయి. ఇక సంఖ్యాశాస్త్రం ప్రకారం సరి సంఖ్యలను ఆడ సంఖ్యలుగా పేర్కొంటారు. అదే బేసి సంఖ్యలను అయితే మగ సంఖ్యలని అంటారు. కనుక మగవారిలో ఉండే ఆడ లక్షణాలను బ్యాలెన్స్ చేయాలంటే ఆడ లక్షణం కలిగిన సరి సంఖ్య పదాలను పేర్లుగా పెట్టాలి. అదే ఆడవారిలో ఉండే మగ లక్షణాలను బ్యాలెన్స్ చేయాలంటే వారికి మగ సంఖ్య పదాలను.. అంటే బేసి సంఖ్య పదాలను పేర్లుగా పెట్టాలి. అందుకే మగపిల్లలకు అయితే 2, 4, 6, 8 సంఖ్యలో అక్షరాలు వచ్చేలా పేర్లు పెట్టాల్సి ఉంటుంది. అదే ఆడవారికైతే 3,5,7,9 సంఖ్యలో అక్షరాలు వచ్చేలా పేర్లు పెట్టాలి. ఇవీ.. పిల్లలకు పేర్లు పెట్టడం వెనుక ఉన్న అసలు నియమాలు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…