కరోనా సెకండ్ వేవ్ సమయంలో సోషల్ మీడియాలో అనేక తప్పుడు, ఫేక్ వార్తలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. అలాంటి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే కొందరు వ్యక్తులు కావాలని పనిగట్టుకుని మరీ కరోనా వ్యాక్సినేషన్‌పై తప్పుడు వార్తలను సృష్టిస్తూ ప్రచారం చేస్తున్నారు. దీంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. ఇక తాజా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కరోనా వ్యాక్సిన్‌పై ఓ సెన్సేషనల్ వార్తను ప్రచారం చేస్తున్నారు.
కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తుల్లో టీకా వేయించుకున్న చేతి నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతుందనే ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన చేతిని బల్బు మీద ఉంచగానే ఆ బల్బు వెలుగుతుంది. వీడియోలో ఆ దృశ్యాలను చూడవచ్చు. కోవిడ్ వ్యాక్సిన్‌లో లోహాలు లేదా చిన్నపాటి చిప్స్ ఉంటున్నాయని, అందువల్ల టీకాలను తీసుకున్న తరువాత టీకా వేయించుకున్న చేతి నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతుందని ఆ వీడియోలో చెప్పారు.
सोशल मीडिया पर शेयर किए जा रहे एक वीडियो में दावा किया गया जा रहा है कि #COVID19 के टीकाकरण के बाद, टीका लगाए हुए बाहों से बिजली उत्पन्न हो जाती है।#PIBFactCheck: यह दावा #फ़र्ज़ी है। #CovidVaccine पूरी तरह सुरक्षित है। ऐसे फ़र्ज़ी सूचनाओं पर विश्वास न करें,टीकाकरण जरूर करवाएं। pic.twitter.com/pngYElNSjp
— PIB Fact Check (@PIBFactCheck) May 30, 2021
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఈ విషయాన్ని పరిశీలించి అసలు నిజం చెప్పింది. టీకా వేయించుకున్న చేతి నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతుందని ప్రచారం అవుతున్న ఆ వార్తలో నిజం లేదని స్పష్టం చేసింది. కోవిడ్ టీకాలలో లోహాలు కానీ, మైక్రో చిప్‌లు కానీ లేవని, ఆ వార్త పూర్తిగా అసత్యం అని తేల్చి చెప్పింది. అందువల్ల ప్రజలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఇలాంటి సెన్సేషనల్ వార్తలను నమ్మకూడదని హెచ్చరించింది.