దేశవ్యాప్తంగా రోజు రోజుకీ నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. గత వారం రోజులుగా రోజుకు 2.50 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతుండగా ఇప్పుడది 3 లక్షలు దాటింది. దీంతో వైద్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వాలు వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే మరింత ప్రమాదం తలెత్తే అవకాశం ఉంటుందని అంటున్నారు. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో కొందరు ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారు. దీంతో కోవిడ్‌పై రోజూ రకరకాల ఫేక్ వార్తలు ప్రచారమవుతున్నాయి.
పచ్చి ఉల్లిపాయలను రాక్ సాల్ట్‌తో కలిపి తింటే కేవలం 15 నిమిషాల్లోనే కరోనా నయం అవుతుందనే ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీన్ని పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. అయితే ఇందులో ఎంత మాత్రం నిజం లేదని, కోవిడ్ ప్రమాదకరమైన వైరస్ అని, అంతటి వైరస్‌ను నాశనం చేసే శక్తి ఉల్లిపాయలకు, రాక్ సాల్ట్‌కు లేదని వైద్య నిపుణులు తెలిపారు.
అందువల్ల సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి వార్తలను నమ్మకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎవరికైనా ఇలాంటి మెసేజ్‌లు వస్తే ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. లేదంటే నష్టపోయే అవకాశం ఉంటుందని అంటున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…