Udayabhanu : సెలబ్రిటీలు చాలా బాధ్యాయుతంగా ఉండాలి. వారు ఏదైన స్టేట్మెంట్ పాస్ చేసారంటే దానిలో కచ్చితత్వం తప్పక ఉండితీరాలి. ఏది పడితే అది మాట్లాడితే జనాలలోకి రాంగ్గా వెళుతుంది. తాజాగా ఉదయభాను పాలకూర తింటే కిడ్నీలు వస్తాయనే విషయంలో రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చి విమర్శల పాలైంది. వివరాలలోకి వెళితే ఒకప్పుడు యాంకర్‌గా అదరగొట్టిన ఉదయభాను పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి కాస్త దూరంగానే ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ యూట్యూబ్‌లో ఆసక్తికర వీడియోలు షేర్ చేస్తుంది. అయితే రీసెంట్గా ఉదయభాను యూట్యూబ్‌లో ఒక రెసిపీకి సంబంధించిన వీడియో షేర్ చేసింది. ఇందులో ఆమె చేసిన కామెంట్స్ ట్రోలింగ్కి దారి తీసాయి.
ఆకు కూరలను శుభ్రం చేయడం గురించి ఉదయ భాను ఒక వీడియో చేయగా ఆ వీడియోలో కిడ్నీలో రాళ్ల ప్రస్తావన తీసుకొచ్చారు. గోంగూరను కడుగుతున్నప్పుడు వచ్చిన ఇసుకను చూపించిన ఉదయభాను.. ఆకు కూరలను రెండుమూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలని చెప్పారు. అలానే పాలకూర భూమికి చాలా దగ్గరగా పెరుగుతుందని, దాంతో ఆకులకి ఎక్కవు ఇసుక అంటుకొని మనం సరిగ్గా కడగని పక్షంలో అది మన కడుపులోకి వెళ్లిపోయి కిడ్నీలో రాళ్లు వస్తాయని ఉదయభాను వివరించారు. ఇది చూసిన ఒక డాక్టర్.. ఉదయభాను వీడియోలోని ఈ చిన్న క్లిప్‌ను బయటికి తీసి ఇది తప్పని చెబుతూ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ప్రస్తుతం ఎక్స్‌లో ఈ వీడియో వైరల్ అవుతోంది. తెలియకపోతే తెలియనట్టు ఉండాలని.. ఏదిపడితే అది చెబితే ఎలా అంటూ ఉదయభానుని తిట్టిపోస్తున్నారు. పాలకూరలో 100 గ్రాములు ఆగ్జలేట్ ఉంటుందట. అలానే టమాటాల్లో 50 మిల్లీ గ్రాముల ఆగ్జలేట్స్ ఉంటాయట. ఈ రెండూ కలిపితే ఆగ్జలేట్స్ మరింత ఎక్కువైపోయి కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయట. అయితే, పాలకూరను పచ్చిగా తీసుకున్నప్పుడే ఈ సమస్య వస్తుందని చాలా దోసెల్లో, సలాడ్స్‌లో పచ్చిగా తింటారు కాబట్టే కిడ్నీలో స్టోన్ సమస్య వస్తుందని ఓ సందర్భంలో మంతెన సత్యనారాయణ చెప్పారు. వేడిచేసినప్పుడు ఆగ్జలేట్స్ 85 నుంచి 90 శాతం తగ్గిపోతాయి కాబట్టి పాలకూరను వండుకొని తిన్నప్పుడు ఎలాంటి సమస్యాలేదని మంతెన స్పష్టం చేశారు. అయితే ఉదయ భాను చెప్పింది పూర్తిగా అసత్యం కాబట్టి ఆమెని ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు.
https://twitter.com/OutOfContextTel/status/1735835060891172883