Tollywood Releases This Week : చూస్తుండగానే 2023 సంవత్సరం ముగిసిపోతుంది. ఏడాది చివరిలో ప్రేక్షకులకి మంచి వినోదం పంచేందుకు సిద్ధమవుతున్నారు. డిసెంబర్ మొదటివారంలో ) పలు చిత్రాలో థియేటర్స్, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు అందరి దృష్టి రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘యానిమల్’ . రష్మిక మందన్నా కథానాయిక. బాబీ దేవోల్ విలనగా కనిపించనున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ ఒకటో తేదీన హిందీ, తెలుగు, భాషల్లో విడుదల కానుంది. తండ్రి కొడుకుల మధ్య అనుబంధం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది.
యానిమల్ సినిమాని తెలుగులోను భారీ ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు.ఈ క్రమంలో తెలుగులోను ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే యానిమల్‌కి పోటీగా పలు తెలుగు సినిమాలు విడుదల అవుతున్నా కూడా వాటిపై పెద్దగా అంచనాలు లేవు. ఇది యానిమల్ సినిమాకి చాలా కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన కాలింగ్ సహస్ర చిత్రం క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందగా, ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అరుణ్ విక్కీరాలా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డాలీషా హీరోయిన్‌గా నటించింది.

కంచర్ల ఉపేంద్ర, సావిత్రి కృష్ణ జంటగా ఆర్యన్ సుభాన ఎస్.కె తెరకెక్కించిన చిత్రం ‘ఉపేంద్ర గాడి అడ్డా’. కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్నారు. ‘కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందిన మాస్ చిత్రమిది. డిసెంబర్ 1న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది. కార్తిక్‌రాజు కథానాయకుడిగా తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ ‘అథర్వ’. సిమ్రాన్ చౌదరి, ఐరా కథానాయికలు మహేశ్‌రెడ్డి దర్శకత్వం వహించారు. సుభాష్ నూతలపాటి నిర్మించారు. ‘ఇదొక భిన్నమైన క్రైమ్ థ్రిల్లర్. థ్రిల్లింగ్ అంశాలతో కూడిన ఈ కథ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుంది’ అని చిత్ర బృందం చెబుతోంది. వచ్చే నెల ఒకటో తేదిన చిత్రం విడుదల కానుంది. నందమూరి చైతన్య కృష్ణ బ్రీత్ డిసెంబర్ 2న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలతో పాటు విజయ్ ఆంటోనీ డబ్బింగ్ మూవీ విక్రమ్ రాథోడ్ ఈ ఫ్రైడే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.