Tiger Nageswara Rao OTT Release Date : మాస్ మహరాజా రవితేజ గత కొద్ది రోజులుగా హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తున్న విషయం తెలిసిందే. మాస్ మహారాజా రవితేజ రీసెంట్‌గా నటించిన లేటెస్ట్ మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రం స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఓమోస్తరు కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణూ దేశాయ్ కీలక పాత్రలో నటించింది. అయితే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడగా, చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, ఈ చిత్రాన్ని కాస్త ముందుగానే ఈ మూవీని ఓటీటీలో విడుదల చేసేందుకు మేకర్స్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
నవంబర్ లాస్ట్ వీక్‌లో టైగర్ నాగేశ్వరరావు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. నవంబర్ 24న ఈ బయోపిక్ మూవీ ఓటీటీలో రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుండగా, ఈ చిత్రం ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ దాదాపు 15 కోట్లకు దక్కించుకున్నట్లు తెలిసింది. 1980 దశకంలో తెలుగు రాష్ట్రాల్లో పేరు మోసిన గజదొంగగా చెలామణి అయిన స్టూవర్ట్‌పురం నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఫిక్షనల్ బయోపిక్‌గా టైగర్ నాగేశ్వరరావు చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందింది. ఈ చిత్రంపై మొదటి నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.
రవితేజకి తెలుగులోనే కాకుండా ఇతర భాషలలోను మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో ఈ సినిమాని భారీ అంచనాలతో పాన్ ఇండియన్ లెవెల్ రిలీజ్ చేశారు. టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నుపూర్‌సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. రేణుదేశాయ్, అనుపమ్‌ఖేర్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం రిలీజ్ ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. రవితేజ అభిమానులు ఎప్పుడెప్పుడా ఈ సినిమా చూద్దామని ఎంతో ఆశగా ఎదురు చూశారు. రిలీజ్ తర్వా త ఈమూవీ కొందరికి నచ్చింది. మరి కొందరకి మాత్రం నిరాశని మిగిల్చింది. టైగర్ నాగేశ్వరావు తర్వాత ఈగల్ మూవీతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రవితేజ.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…