వినోదం

Tiger 3 OTT Release Date : టైగ‌ర్ 3 అభిమానుల‌కి గుడ్ న్యూస్.. ఓటీటీలోకి రాబోతున్న క్రేజీ మూవీ..!

Tiger 3 OTT Release Date : బాలీవుడ్ స్టార్ హీరోల‌లో స‌ల్మాన్ ఒక‌రు. ఆయ‌న ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్‌ను తెచ్చుకున్నారు. తనదైన చిత్రాలతో సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను అలరిస్తోన్న అతడు.. ఈ మధ్య పెద్దగా భారీ హిట్లను అందుకోవట్లేదు. అయితే రీసెంట్‌గా మ‌నీష్ శర్మ తెరకెక్కించిన చిత్రం ‘టైగర్ 3తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీకి అమెరికాలోని ప్రీమియర్స్ నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అలాగే, ఇండియాలో కూడా అదే కనిపించింది. దీపావళి కానుకగా నవంబర్ 12న విడుదలైన టైగర్‌ 3 సినిమా సగటు సినీ ప్రేక్షకులకు పెద్దగా నచ్చకపోయినా సల్మాన్ ఖాన్ అభిమానులకు మాత్రం ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ బాగా నచ్చేసింది. దీంతో సల్లూ భాయ్‌ సినిమాకు హౌస్ ఫుల్ కలెక్షన్లు వస్తున్నాయి.

తొలి మూడు రోజులు మంచి వసూళ్లను రాబట్టిన ‘టైగర్ 3’ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ 150 కోట్లకు చేరువలో ఉంది. ‘టైగర్ 3’కి తొలిరోజే భారీ ఓపెనింగ్ వచ్చింది. నవంబర్ 12న ఈ సినిమా 44.50 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఆ తర్వాత రెండో రోజు రూ.59 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక మూడో రోజు వసూళ్లు రూ.42.50 కోట్లు రాబట్టిందని ట్రేడ్‌ నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా మూడు రోజుల్లోనే 145 కోట్ల రూపాయలను కలెక్ట్‌ చేసిన టైగర్ 3 రూ.150 కోట్ల మార్కును అందుకునేందుకు చేరువలో ఉంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే రూ. 200 కోట్లకు చేరువలో సల్మాన్‌ మూవీ ఉందని తెలుస్తోంది.

Tiger 3 OTT Release Date

స‌ల్మాన్‌కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. అంతేకాదు, థియేటర్లలో విడుదలైన 50 రోజుల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు డీల్ చేసుకున్నారట. అంటే నవంబర్ 12న విడుదలైన ‘టైగర్ 3’ జనవరి మొదటి వారంలో స్ట్రీమింగ్‌కు వస్తుందని సమాచారం. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ చిత్రంలో కత్రినా కైఫ్ హీరోయిన్‌గా, ఇమ్రాన్ హస్మీ విలన్‌గా చేశారు. ఈ క్రేజీ యాక్షన్ ఫిల్మ్‌కు ప్రీతమ్, తనూజ్ మ్యూజిక్ ఇచ్చారు.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM