Tiger 3 OTT Release Date : బాలీవుడ్ స్టార్ హీరోలలో సల్మాన్ ఒకరు. ఆయన ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్‌ను తెచ్చుకున్నారు. తనదైన చిత్రాలతో సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను అలరిస్తోన్న అతడు.. ఈ మధ్య పెద్దగా భారీ హిట్లను అందుకోవట్లేదు. అయితే రీసెంట్‌గా మనీష్ శర్మ తెరకెక్కించిన చిత్రం ‘టైగర్ 3తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీకి అమెరికాలోని ప్రీమియర్స్ నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అలాగే, ఇండియాలో కూడా అదే కనిపించింది. దీపావళి కానుకగా నవంబర్ 12న విడుదలైన టైగర్ 3 సినిమా సగటు సినీ ప్రేక్షకులకు పెద్దగా నచ్చకపోయినా సల్మాన్ ఖాన్ అభిమానులకు మాత్రం ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ బాగా నచ్చేసింది. దీంతో సల్లూ భాయ్ సినిమాకు హౌస్ ఫుల్ కలెక్షన్లు వస్తున్నాయి.
తొలి మూడు రోజులు మంచి వసూళ్లను రాబట్టిన ‘టైగర్ 3’ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ 150 కోట్లకు చేరువలో ఉంది. ‘టైగర్ 3’కి తొలిరోజే భారీ ఓపెనింగ్ వచ్చింది. నవంబర్ 12న ఈ సినిమా 44.50 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఆ తర్వాత రెండో రోజు రూ.59 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక మూడో రోజు వసూళ్లు రూ.42.50 కోట్లు రాబట్టిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా మూడు రోజుల్లోనే 145 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసిన టైగర్ 3 రూ.150 కోట్ల మార్కును అందుకునేందుకు చేరువలో ఉంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే రూ. 200 కోట్లకు చేరువలో సల్మాన్ మూవీ ఉందని తెలుస్తోంది.

సల్మాన్‌కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. అంతేకాదు, థియేటర్లలో విడుదలైన 50 రోజుల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు డీల్ చేసుకున్నారట. అంటే నవంబర్ 12న విడుదలైన ‘టైగర్ 3’ జనవరి మొదటి వారంలో స్ట్రీమింగ్‌కు వస్తుందని సమాచారం. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ చిత్రంలో కత్రినా కైఫ్ హీరోయిన్‌గా, ఇమ్రాన్ హస్మీ విలన్‌గా చేశారు. ఈ క్రేజీ యాక్షన్ ఫిల్మ్‌కు ప్రీతమ్, తనూజ్ మ్యూజిక్ ఇచ్చారు.