The Village Series OTT Release Date : ఆర్య.. ఈ స్టార్ హీరో గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళంతో పాటు తెలుగులోను వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులని అలరించాడు. రీసెంట్‌గా ఆర్య ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘ది విలేజ్’. ఈ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుండగా, ఇందులో దివ్య పిళ్లై, అజియా, ఆడుకలం నరేన్, జార్జ్ మాయన్, పి.ఎన్. సన్నీ, ముత్తుకుమార్ కె, కలైరాణి ఎస్.ఎస్ కీలకపాత్రలలో నటించారు.. దీనికి మిలింద్ రాజు దర్శకత్వం వహించగా, ఈ చిత్రాన్ని స్టూడియో శక్తి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బి.ఎస్. రాధాకృష్ణన్ నిర్మించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో హారర్ ఒరిజినల్ సిరీస్‌గా రూపొందించగా, ఈ చిత్రాన్ని తమిళంతోపాటు.. తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేశారు.
షమిక్ దాస్ గుప్త రచించిన గ్రాఫిక్ నవల ఆధారంగా ది విలేజ్ వెబ్ సిరీస్ రూపొందగా, ఇప్పటికే విడుదలైన ది విలేజ్ సిరీస్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ది విలేజ్ వెబ్ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో నవంబర్ 24 నుంచి తమిళంతోపాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన పోస్టర్‌లో చెట్టు రూపంలో ఆర్య మొహం, కొన్ని చేతులు ఆర్యను లోయలోకి లాగడం వంటివి అందరికి వణుకు పుట్టించేలా ఉన్నాయి. ది విలేజ్ వెబ్ సిరీస్ ప్రేక్షకులకి వణుకు పుట్టించేలా కనిపిస్తుంది. మరి నిజంగా ఎంతగా అలరిస్తుందో తెలియాలంటే నవంబర్ 24 వరకు ఆగాల్సిందే.
ఒక రాత్రి తప్పిపోయిన తన కుటుంబాన్ని తిరిగి పొందేందుకు ఒక వ్యక్తి ఎలాంటి త్యాగానికైన సిద్ధమవుతాడు. ఆ సమయంలో తను ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నాడు? తన కుటుంబం ఏమైంది? చివరకు తన కుటుంబాన్ని తిరిగి పొందాడు అనేది ఈ వెబ్ సిరీస్ ద్వారా దర్శకుడు ప్రేక్షకులకి తెలియజేయనున్నాడు. మరి ఇంతగా ఎంతగా అలరిస్తుందనేది ఒక పది రోజులు ఆగితే కాని తెలియదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…