SS Rajamouli : ఓటమెరుగని విక్రమార్కుడు రాజమౌళి వరుస సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ మంచి హిట్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ హిట్ కొట్టిన జక్కన్న త్వరలో మహేష్ బాబుతో సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ‘గుంటూరు కారంస షూటింగ్ లో బిజీ గా వున్నాడు. ఈ సినిమా షూటింగ్ నవంబర్ నెల చివరికి పూర్తి చేసేయ్యాలని మహేష్ బాబు చాలా క్లియర్ గా వున్నాడు, అందుకే ఈ సినిమాకి ఇప్పుడు గ్యాప్ లేకుండా షూటింగ్ చేసుకుంటూ వెళుతున్నాడు అని తెలిసింది.
గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు.. రాజమౌళితో సినిమా చేయనున్నాడు. సాధారణంగా రాజమౌళి ఏ సినిమా అవుట్‌పుట్ విషయంలో వెనక్కు తగ్గరు . ఎంత లేట్ అయినా ఫర్వాలేదు గానీ అనుకున్న అవుట్‌పుట్ వచ్చేదాకా అస్సలు వదిలిపెట్టరు. నటీనటులతో తనకు కావాల్సిన విధంగా ఫైనల్ ప్రింట్ తీసుకుంటారు జక్కన్న. ఇకపోతే నటీనటులు సినిమాకు మేజర్ హైలైట్ అయ్యేలా ప్లాన్ చేసుకోవడం రాజమౌళి సక్సెస్ మంత్ర. ఈ క్రమంలోనే మహేష్ బాబుతో చేయబోతున్న సినిమా కోసం దిమ్మతిరిగే స్కెచ్ వేసుకొని బాలీవుడ్ సహా హాలీవుడ్ యాక్టర్స్ ని రంగంలోకి దించుతున్నారట. అయితే మహేష్ విషయంలో రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు తెలుస్తుంది.
రోజుకి 8 గంటలు జిమ్ చేస్తూ ఆహార డైట్ కూడా ఫాలో అవ్వాలని రాజమౌళి.. మహేష్ బాబుకి సూచించారట. ప్రస్తుతం గుంటూరు కారం సినిమా చిత్రీకరణను పూర్తి చేసే పనిలో ఉన్న మహేశ్ బాబుకు రెండింటిని బ్యాలెన్స్ చేయడం కష్టంగా మారిందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. రెండు సినిమాలకి ఒకే సమయంలో మహేష్ బాబు ఇలా కష్టపడుతుండడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ సినిమా ఏ జానర్‌లో ఉండబోతోందనే విషయాన్ని కన్ఫర్మ్ చేసిన రాజమౌళి.. అందుకు తగ్గట్లుగా ఓ ప్లాన్ రెడీ చేసుకున్నారట. యాక్షన్ అండ్ అడ్వెంచర్ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంలో హాలీవుడ్ దిగ్గజాలు భాగమయ్యేలా చేసుకుంటున్నారట. ఈ విషయాలను స్వయంగా రాజమౌళి తండ్రి, స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ చెప్పడంతో మహేష్ ఫ్యాన్స్ హుషారెత్తిపోతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…