వినోదం

మహేష్, పవన్ సినిమాలను తిర‌స్క‌రంచిన శోభన్ బాబు.. ఎందుకంటే..?

తెలుగు సినిమా ప్రేక్ష‌కుల‌కు స్టార్ హీరో శోభ‌న్ బాబు గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న అప్ప‌ట్లో ఎన్నో చిత్రాల్లో న‌టించి త‌న స‌త్తా చాటారు. అద్భుత‌మైన యాక్టింగ్ ఈయ‌న సొంతం. సోగ్గాడు అన‌గానే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేది శోభ‌న్ బాబే. ఈయ‌న త‌న స్టైల్‌తోనూ ఎంతో మందిని ఆక‌ట్టుకున్నారు. అప్ప‌ట్లో అంద‌మైన న‌టులు అన‌గానే మ‌నకు శోభ‌న్ బాబు పేరే ముందుగా గుర్తుకు వ‌స్తుంది. ఇక శోభ‌న్ బాబు అనేక పౌరాణిక‌, జాన‌ప‌ద, సాంఘిక చిత్రాల్లో న‌టించారు. ఆయ‌న ఎక్కువ‌గా ఫ్యామిలీ చిత్రాల‌ను చేశారు. దీంతో ఆయ‌న‌కు మ‌హిళా ఫ్యాన్స్ కూడా ఎక్కువే అని చెప్ప‌వ‌చ్చు.

విల‌క్ష‌ణ‌మైన న‌ట‌న ఆయ‌న సొంతం. ఆయ‌న ఎన్నో అద్భుత‌మైన చిత్రాల్లో న‌టించారు. అయితే వ‌య‌స్సు పైబ‌డ్డాక ఆయ‌న ఇక సినిమాల‌కు దూర‌మ‌వుతున్న‌ట్లు ప్ర‌క‌టించి అంద‌రికీ షాకిచ్చారు. త‌న కుటుంబం నుంచి కూడా ఎవ‌రినీ సినిమా రంగంలోకి వెళ్ల‌నివ్వలేదు. అయితే హీరోగా న‌టిస్తున్న స‌మ‌యంలోనే ఆయ‌న త‌న సంపాద‌న‌తో ఎన్నో ఆస్తుల‌ను కూడ‌బెట్టారు. ముఖ్యంగా భూముల‌ను బాగా కొన్నారు. దీంతో ఆయ‌న పిల్ల‌ల‌కు డ‌బ్బుకు కొదువ లేకుండా పోయింది. అందుక‌నే పిల్ల‌ల్ని స‌గం సినిమాల‌కు దూరం చేశార‌ని అంటారు. ఇక అప్ప‌ట్లో ఏ హీరోకు లేని ఆస్తి శోభ‌న్ బాబుకు ఉండేది.

ఇక చెన్నైలో ఆస్తుల‌ను కూడ‌బెట్టిన శోభ‌న్ బాబు సినిమాల‌కు దూరం అయ్యాక అక్క‌డే సెటిల‌య్యారు. ఫ్యామిలీతో అక్క‌డే ఉంటున్నారు. సినిమాల‌కు రిటైర్మెంట్ ఇచ్చాక త‌న మాట‌కు తాను క‌ట్టుబ‌డ్డారు. ఎన్నో సినిమాల్లో ఆఫ‌ర్లు వ‌చ్చినా ఆయ‌న చేయ‌లేదు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో సుస్వాగతం సినిమాకు మంచి పేరు వచ్చింది. అందులో పవన్ తో పాటు అతడి తండ్రిగా రఘువరన్ నటనకు కూడా మంచి స్పందన వచ్చింది. అయితే రఘువరన్ పాత్రకోసం శోభన్ బాబుకి ఛాన్స్ వచ్చినా వదిలేశారు. అంతేకాదు అతడు సినిమాలో నాజర్ పాత్ర కోసం అడిగితే కాదన్నారట. అలా మహేష్ బాబుతో కలిసి నటించే ఛాన్స్ ను వదిలేసుకున్నారు. అయితే సినిమా రంగం అంటే ఉన్న అయిష్ట‌త వ‌ల్ల‌నే శోభ‌న్ బాబు త‌న మాట‌కు క‌ట్టుబ‌డి ఇక సినిమాలు చేయ‌లేద‌ని అర్థం చేసుకోవ‌చ్చు. అదే ఆయ‌న మ‌ళ్లీ సినిమాల్లో న‌టించి ఉంటే ఆ రేంజ్ వేరేగా ఉండేది. ఆయ‌న‌ను చూసేందుకే సినిమాల‌కు వచ్చేవార‌ని క‌చ్చితంగా చెప్ప‌వ‌చ్చు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM