Salaar Day 3 Collection : భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం సలార్. క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ చిత్రానికి కలెక్షన్స్ వర్షం కురుస్తుంది.సలార్ సినిమా బాక్సాఫీస్ పునాదులను కదిలిస్తోంది. గతంలో ఉన్న లెక్కలను తిరగరాస్తోంది. సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది. సినిమాలో ఎక్కడా ఒక్క వల్గర్ సీన్ కూడా లేదు. ముద్దుల్లేవు.. హగ్గుల్లేవు… అయినా సరే ప్రేక్షకులు మాత్రం దీన్ని బాగా ఆదరించారు. సినిమా మొత్తం మంచి కథ, కథనంతో ముందుకు వెళ్లడంతో ఫ్యామిలీ అంతా కలిసి ఈ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు.. ఇటీవలి కాలంలో కుటుంబం మొత్తం కలిసి చూసే సినిమానే రాలేదు.. ఒక్క హాయ్ నాన్న మినహా.
సలార్ చిత్రంలో అసభ్యకరమైన పదజాలం కూడా ఎక్కడ కనిపించలేదు.. అలాంటి సినిమా రూ.వెయ్యి కోట్లు కలెక్ట్ చేసేదిగా ముందుకు దూసుకుపోతోంది. సలార్ మొదటి రెండు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ. 250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. సలార్ ,చిత్రం విడుదలైన రోజున ప్రపంచవ్యాప్తంగా రూ. 97.49 కోట్ల షేర్, రూ. 167 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. వాటిలో తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 71 కోట్లకుపైగా గ్రాస్ కలెక్ట్ చేయగా.. హిందీలో రూ. 20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 53.50 కోట్లు కేరళలో రూ. 4.75 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్టు తెలుస్తుంది.ఈ సినిమా మొదటి రోజే దేశ వ్యాప్తంగా రూ.93.45 కోట్లు వసూల్ చేసింది. ఇదే జోరును రెండో రోజూ ప్రదర్శిస్తూ అన్ని భాషల్లో కలిపి దాదాపు రూ.57.61 కోట్ల కలెక్షన్లను సాధించింది.
దీంతో రెండు రోజుల్లోనే సినిమా దాదాపు రూ.150 కోట్లు దాటింది. వరల్డ్‌వైడ్‌గా ‘సలార్’ తొలిరోజు రూ. 178.7 కోట్లు వసూల్ చేసింది. సలార్ రెండో రోజు కూడా 100 కోట్ల మార్క్ అందుకుని 2 రోజుల్లో మొత్తంగా రూ. 250 కోట్ల గ్రాస్, రూ. 170 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేయనుందని విశ్లేషకులు అంచనా వేశారు. అలాగే మూడో రోజు ఆదివారం కూడా సలార్‌కు అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే జరిగాయని లెక్కలు చెబుతున్నాయి. సలార్‌కు హిందీ బెల్ట్‌లో రూ. 5.5 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ జరిగినట్లు ట్రేడ్ సంస్థలు చెబుతుండగా, ఢిల్లీ రూ. 96.89 లక్షలతో అగ్రస్థానంలో ఉంటే.. రూ. 50.87 లక్షలతో ముంబై రెండో స్థానం, రూ. 24.26 లక్షలతో బెంగళూరు మూడో స్థానంలో నిలిచింది. విడుదలైన తొలి రెండు రోజుల్లో వసూళ్ల సునామీ సృష్టించిన సలార్ మూడో రోజు కూడా అదే హవా కొనసాగించనుందని సినిమా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…