Sai Dharam Tej : సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీసెంట్‌గా సంభవించిన ఏపీ, తెలంగాణ వరదలకు ఎంతో మంది బాధితులుగా నిలిచారు. వారిని ఆదుకునేందుకు మెగా ఫ్యామిలీ నుంచి హీరోలంతా ముందుకు వచ్చి విరాళాలు అందించారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, సాయి దుర్గతేజ్, వరుణ్ తేజ్, నిహారిక.. ఇలా అందరూ తమ వంతుగా సాయం ప్రకటించారు.హీరో సాయి తేజ్ రూ.10 లక్షల విరాళం ప్రకటించగా.. ఆ చెక్ ను తాజాగా నారా లోకేశ్ కు అందించారు.
ఈ సందర్భంగా సాయి దుర్గా తేజ్ ను మంత్రి లోకేశ్ అభినందించారు. విజయవాడలో కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని సాయి తేజ్ దర్శించుకున్నారు. ఆ తర్వాత విజయవాడలోని ఆమ్మ ప్రేమ ఆరాధన వృద్ధాశ్రామానికి కూడా వెళ్లారు. ఆ వృద్ధాశ్రమానికి వెళతానని గతంలో ఇచ్చిన మాటను గుర్తుపెట్టుకొని ఇప్పుడు నెరవేర్చారు సాయి తేజ్. అక్కడి వృద్ధులతో ఆయన ఆప్యాయంగా మాట్లాడారు. ఆ వృద్ధాశ్రమానికి రూ.5లక్షలను విరాళంగా ఇచ్చారు.అమ్మ ఆశ్రమానికి సొంత భవనం కట్టిస్తానని 2019లో తన పుట్టినరోజున మాటిచ్చిన సాయి దుర్గతేజ్… చెప్పినట్లుగానే 2021లో బిల్డింగ్ కట్టించి ఇచ్చారు.
మూడేళ్ల పాటు అమ్మ అనాథాశ్రమాన్ని దత్తత తీసుకుని మొత్తం ఖర్చులన్నీ భరించారు. సాయి దుర్గతేజ్ మంచి మనసుకు ఆశ్రమవాసులతో పాటు ప్రజలందరి ప్రశంసలు దక్కాయి.మేనమామ, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుంచి సేవా గుణాన్ని పుణికిపుచ్చుకున్న సాయి దుర్గతేజ్ భవిష్యత్‌లోనూ తనకు వీలైనంతగా సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజానికి తనవంతుగా అండగా నిలబడాలని భావిస్తున్నారు.ఇక ఈ మధ్య సాయి ధరమ్ తేజ్ సినిమాల స్పీడ్ కాస్త తగ్గించారు. యాక్సిడెంట్ తర్వాత కాస్త ఒళ్లు చేయడంతో ఇప్పుడు ఫిజిక్‌పై దృష్టి పెట్టారు. మరి కొద్ది రోజులలో వరుస సినిమాలతో సందడి చేయనున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…