RRR : దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చిత్రం RRR. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను గత కొంత సేపటి క్రితమే విడుదల చేయగా.. దానికి భారీ ఎత్తున స్పందన లభిస్తోంది. యూట్యూబ్‌లో ఇప్పటికే ఈ ట్రైలర్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం RRR నామస్మరణతో మారుమోగిపోతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలోనూ RRR ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
కాగా RRR చిత్రయూనిట్ ముంబైలో నేడు హిందీ మీడియాతో సమావేశం కానున్నారు. ఈ క్రమంలోనే చిత్ర నటీనటులు, సిబ్బంది అందరూ ప్రెస్ మీట్‌లో పాల్గొననున్నారు. బీ టౌన్ మీడియాతో మాట్లాడనున్నారు. ఇక చిత్రంలో లీడ్ హీరోల్లో ఒకరిగా ఉన్న ఎన్టీఆర్ ఇప్పటికే ముంబై చేరుకున్నారు. అయితే మరో లీడ్ హీరో రామ్ చరణ్ తేజ మాత్రం ఈ ప్రెస్ మీట్‌లో పాల్గొనడం లేదు.
ముంబైలో జరగనున్న RRR చిత్ర యూనిట్ ప్రెస్ మీట్‌కు రామ్ చరణ్ హాజరు కావడం లేదు. కారణం.. తన కుటుంబంలో ఓ వివాహ వేడుక జరగనుండడమే. రామ్ చరణ్ తేజ భార్య ఉపాసన సోదరి అనుష్పల కామినేని వివాహం అర్మాన్ ఇబ్రహీంతో ఇటీవల జరిగిన విషయం విదితమే. ఈ క్రమంలోనే ఈ పెళ్లికి సంబంధించి వేడుకలు ఇంకా పూర్తి కాలేదు. అయితే ఇవాళ ముంబైలో జరగనున్న ప్రెస్ మీట్‌కు హాజరు కాలేకపోయినప్పటికీ.. త్వరలో దేశవ్యాప్తంగా అనేక చోట్ల జరగనున్న RRR చిత్ర ప్రమోషన్లలో రామ్ చరణ్ తేజ పాల్గొననున్నారు.
కాగా తాజాగా విడుదలైన RRR ట్రైలర్ కు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి విశేష రీతిలో స్పందన లభిస్తోంది. బాహుబలి తరువాత విడుదల అవుతున్న రాజమౌళి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ ట్రైలర్‌ను చూశాక.. సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా.. అని అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. ఇక RRR మూవీ జనవరి 7, 2022న ప్రపంప వ్యాప్తంగా విడుదల కానుంది. ఐమ్యాక్స్, 3డీ ఫార్మాట్‌లలోనూ మూవీని విడుదల చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…