RRR Movie : కరోనా నేపథ్యంలో అటు హిందీ చిత్ర పరిశ్రమ మొదలుకొని కింది వరకు అన్ని భాషలకు చెందిన సినీ ఇండస్ట్రీ వర్గాలు తమ మూవీలను చాలా వరకు ఓటీటీల్లోనే విడుదల చేశారు. ఈ మధ్య కాలంలో కరోనా ప్రభావం తగ్గి ఆంక్షలను సడలించారు కనుక యథావిధిగా థియేటర్లలో సినిమాలను రిలీజ్ చేసేందుకే మొగ్గు చూపుతున్నారు.
ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా సినిమాలు ఇప్పటికే ఓటీటీలో సందడి చేశాయి. థియేటర్లలో ఒకవేళ రిలీజ్ అయినా 35-40 రోజుల తరువాత ఓటీటీల్లో రిలీజ్ చేసుకునేలా ముందుగానే ఒప్పందాలు చేసుకుంటున్నారు. దీంతో సినిమా థియేటర్లలో వచ్చిన కొద్ది రోజులకు ఓటీటీకి వస్తోంది. ఈ క్రమంలో చాలా మంది ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం ఎందుకని ఓటీటీల్లో సినిమాలను చూసేందుకే అలవాటు పడ్డారు.
అయితే ముందు ముందు ఈ పరిస్థితి ఉండకపోయినా.. ప్రేక్షకులు మాత్రం ఓటీటీలకు బాగానే అలవాటు పడ్డారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే వారు కొత్త సినిమా ఏది వచ్చినా సరే ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది ? అంటూ తెలుసుకోవడం మొదలు పెట్టారు. ఇక తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీ గురించి కూడా ఈ చర్చ నడుస్తోంది.
ఆర్ఆర్ఆర్ మూవీకి చెందిన ట్రైలర్‌ను తాజాగా లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ ఇప్పటికే యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఇక ఈ మూవీని జనవరి 7వ తేదీన విడుదల చేయనున్నారు. అందులో భాగంగానే చిత్ర యూనిట్ ముంబైలో ప్రెస్ మీట్ నిర్వహించింది. అందులో భాగంగా విలేకరులు ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది ? అని అడిగారు. దీంతో షాకైన చిత్ర యూనిట్ తరువాత ఓపిగ్గానే సమాధానం ఇచ్చింది.
ఆర్ఆర్ఆర్ మూవీని ఎక్కువ రోజుల పాటు ప్రేక్షకులు థియేటర్లలో చూడాలని కోరుకుంటున్నామని ఆ చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలోనే ఓటీటీల్లో 90 రోజుల తరువాతే విడుదల చేస్తామని నిర్మొహమాటంగా చెప్పేశారు. దీన్ని బట్టి చూస్తే.. ఏప్రిల్ 2022లో ఆర్ఆర్ఆర్ మూవీ ఓటీటీల్లోకి వస్తుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…