RRR Movie : రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి ఇద్దరు స్టార్ హీరోలతో దర్శక ధీరుడు రాజమౌళి చేసిన మ్యాజిక్ ఆర్ఆర్ఆర్ చిత్ర రూపంలో జనవరి 7న విడుదల కానుంది. ఈ చిత్రం పాన్ ఇండియా సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ట్రైలర్ మాత్రం తెలుగు ప్రేక్షకులతోపాటు అంతటా ఉన్న సినీ ప్రేక్షకుల రోమాలు నిక్కపొడుచుకునేలా చేసింది.
ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ ట్రైలర్ చర్చనే. విడుదలైన కొన్ని గంటల్లోనే అన్ని భాషల్లోనూ కలిపి 80 మిలియన్స్ పైగానే వ్యూస్ సాధించింది. ఇక వీటితోపాటు తమిళం, కన్నడ, మలయాళ ట్రైలర్లు కూడా మిలియన్ల కొద్దీ వ్యూయర్స్‌ను అట్రాక్ట్ చేస్తున్నాయి. ట్రైలర్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటన.. ఒళ్లు గగుర్పొడిచే సీన్స్, రోమాలు నిక్కబొడిచే సన్నివేశాలు.. ప్రతి భారతీయుడిలోనూ ప్రేరణ నింపేలా సాగే డైలాగ్స్ ఆధ్యంతం ఆసక్తిని కలిగిస్తున్నాయి.
అయితే ఈ ట్రైలర్ ను చూస్తే మనకే ఇలా ఉంటే ఇందులో నటించిన రామ్ చరణ్, ఎన్టీఆర్ ల రియాక్షన్ ఎలా ఉండి ఉంటుందో అని అందరిలోనూ ఒక అనుమానం ఉండేది. దానికి ఆర్ఆర్ఆర్ టీం ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చింది. రాజమౌళితో కూర్చొని ట్రైలర్ చూసిన వాళ్లు చాలా ఎక్కువగా థ్రిల్ ఫీల్ అయ్యారు.
ట్రైలర్ ఇచ్చిన కిక్ తో చరణ్ ఆనందాన్ని ఆపుకోలేక రాజమౌళిని గట్టిగా హత్తుకోగా.. ఎన్టీఆర్ కూడా బాగా ఎగ్జైట్ అవుతూ.. అసలు అదేంటది..? అంటూ బాగా ఎంజాయ్ చేశాడు. ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ చూశాక, మా భీమ్ -రామ్ రియాక్షన్ ఇది అంటూ ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర బృందం ఓ వీడియో నుషేర్ చేయగా, అది వైరల్ అవుతోంది.
Their reaction is priceless… 🤩
Our BHEEM & RAM reacting to #RRRMovie Trailer after watching it for the first time ❤️@ssrajamouli @tarak9999 @alwaysramcharan #RRRTrailer – https://t.co/I1AdSVDSX4 💥 pic.twitter.com/0XEWrk1IIa
— RRR Movie (@RRRMovie) December 12, 2021