RGV : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు వివాదాలతో నిలుస్తుంటాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌పై ఛాన్స్ దొరికినప్పుడల్లా ఏదో ఒక కామెంట్ చేస్తూ హాట్ టాపిక్‌గా నిలుస్తూ ఉంటాడు. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ షోకి వెళ్లి అనేక ఆసక్తికర సంగతులు పంచుకున్నారు. ఇందులో కొన్ని విషయాలు పట్టుకొని ఆయన ప్రత్యర్ధులు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. పరోక్షంగా వైఎస్సార్‌సీపీకి మద్దతుగా మాట్లాడుతోన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రెండు లక్షల పుస్తకాలు చదివానని చెప్పుకునే పవన్ కళ్యాణ్.. వాటిలో 20 పుస్తకాల పేర్లు కూడా చెప్పలేడంటూ వర్మ విమర్శించారు.
తాజాగా వర్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘పవన్ కళ్యాణ్ 2 లక్షల పుస్తకాలు చదివానంటాడు. నాకు తెలిసి 20 పుస్తకాల పేర్లు కూడా చెప్పలేడు. అదే అసలు ప్రాబ్లమ్. 2 లక్షల పుస్తకాలు చదివాను అని చెప్పగానే కుర్రాళ్లంతా ఏయ్ ఏయ్ అని అరుస్తారు. కానీ, ఏమాత్రం ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఉన్నవాడు 2 లక్షల పుస్తకాలు చదివానంటే అస్సలు నమ్మడు. అంటే, వాళ్లతో అక్కడ చప్పట్లు కొట్టించడానికి నువ్వు నీ విశ్వసనీయతను అన్ని చోట్లా కోల్పోతున్నావ్’ అని వర్మ కాస్త వెటకారమైన కామెంట్స్ చేశాడు.
అర్జెంటీనా మార్క్‌సిస్ట్ నేత చే గువేరా తనకు స్ఫూర్తి అని పవన్ కళ్యాణ్ పలుమార్లు చెప్పుకోవడాన్ని కూడా రాంగోపాల్ వర్మ ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. చే గువేరా కంటే గణపతి వందల రెట్లు గొప్పోడు. చే గువేరా అక్కడ చేసిందేమీ లేదు. ఆయన్ని చాలా చిన్న వయసులో చంపేశారు. పవన్ కళ్యాణ్‌కు 18 నుంచి 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు చే గువేరాను చూసి ఇంప్రస్ అయ్యారని.. అప్పటికి చే గువేరా గురించి పవన్‌కు ఏమీ తెలీదని వర్మ విమర్శించారు. మీ ప్రత్యర్థులు చేసేది ఎందుకు తప్పో వివరణాత్మకంగా చెప్పలేకుండా డైలాగులు చెప్తే అలాంటి నాయకత్వం ఎక్కువ కాలం నిలబడదు’ అని వర్మ వివరించారు. ఒక అభిమానిగా పవన్ కళ్యాణ్‌కు తాను ఇచ్చే సలహా ఇదని.. ఆయన చేస్తున్నది తప్పు అని ఎవరైనా చెబితే బాగుంటుందని రాంగోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…