Rashmika Mandanna : విజయ్ తో రష్మిక మాల్దీవ్స్ టూర్.. మళ్లీ గుప్పుమంటున్న వార్త‌లు..

October 7, 2022 9:52 PM

Rashmika Mandanna : అందాల భామ రష్మిక క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ అందుకుంది. అంతే కాదు.. స్టార్ హీరోలకు ఇప్పుడు ఈ అమ్మడే ఫస్ట్ ఛాయిస్ అవుతుంది. కేవలం దక్షిణాదిన మాత్రమే కాకుండా.. బాలీవుడ్ లోనూ తన సత్తా చాటేందుకు ఆమె సిద్దమవుతుంది. ఇక ఇటు తెలుగులోనూ పుష్ప 2లో నటించనుంది. అంతేకాకుండా నేషనల్ క్రష్ గా కూడా బిరుదు అందుకుంది. ఇక ఈ పాపులారిటీతోనే బాలీవుడ్ లో వరుస అవకాశాలను అందుకుంది. అయితే చాలా కాలంగా రష్మిక, విజయ్ దేవరకొండ డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ రూమర్స్ ని రష్మిక, విజయ్ ఖండించలేదు అలాగని అంగీకరించలేదు. వీళ్ళిద్దరూ ఓపెన్ గానే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. కానీ తమ మధ్య రిలేషన్ గురించి మాత్రం ఓపెన్ అవడం లేదు. రోజులు గడిచే కొద్దీ రష్మిక, విజయ్ ల మధ్య బంధం బలపడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా రష్మిక, విజయ్ దేవరకొండ ఎయిర్ పోర్ట్ లో మెరిశారు. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం వీరిద్దరూ మాల్దీవులకు రొమాంటిక్ టూర్ కి వెళుతున్నట్లు తెలుస్తోంది. పెళ్ళికి ముందే వీళ్ళు రొమాంటిక్ టూర్స్ కి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది.

Rashmika Mandanna reportedly goes tour with Vijay Devarakonda
Rashmika Mandanna

రష్మిక వైట్ డ్రెస్ లో, విజయ్ దేవరకొండ క్యాజువల్ వేర్ లో స్టైలిష్ గా కనిపించారు. విజయ్, రష్మిక కలసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించారు. ఈ రెండు చిత్రాల్లో వీరి కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. డియర్ కామ్రేడ్ చిత్రంలో విజయ్, రష్మిక మధ్య లిప్ లాక్ సన్నివేశం కూడా హాట్ టాపిక్ గా మారింది. రష్మిక నటించిన బాలీవుడ్ చిత్రం గుడ్ బై రిలీజ్ అవుతుండడం విశేషం. ఒకవైపు తన సినిమా రిలీజ్ అవుతుంటే.. మరోవైపు రష్మిక.. ప్రియుడితో వెకేషన్ కి వెళ్ళింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వీళ్ళు పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్‌ ఎప్పుడు చెప్తారో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now