Rakul Preet Singh : పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడు సినిమాలతో పాటు సోషల్ మీడియాలో తన అందచందాలు ఆరబోస్తూ కుర్రాళ్లని కంటిపై కునుకు లేకుండా చేస్తుంటుంది. రకుల్ స్టన్నింగ్ లుక్స్ ఎప్పటికప్పుడు కుర్రాళ్లని గిలిగింతలు పెట్టిస్తుంటాయి. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా రెడ్ ఔట్‍ఫిట్‍లో గ్లామర్ ట్రీట్ చేసింది. ఆకర్షణీయమైన డ్రెస్‍లో హాట్ లుక్‍తో అదరగొట్టింది. రెడ్ డ్రెస్ ధరించి తన క్యూట్ అందంతో మైమరిపించిన ఈ అందాల ముద్దుగుమ్మ పిక్స్ లో తెగ హొయలు ఒలికిస్తూ కెమెరాలకు పోజులు ఇచ్చింది. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేసింది.
బాడీ కాన్ ఫిట్టింగ్, వైడ్ స్క్వేర్ నెక్‍లైన్, స్లీవ్‍లెస్ డిజైన్ ఉన్న క్రాసెట్ బ్లౌజ్‍ను రకుల్ ప్రీత్ సింగ్ ధరించగా, ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ ఎద అందాలు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. బ్లౌజ్‍కు సూటయ్యేలా రెడ్ కలర్ స్కర్టును రకుల్ వేసుకోగా, ఈ పిక్స్ నెట్టిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక రకుల్ మెడలో లేయర్డ్ చైన్ లింక్ గోల్డ్ నెక్లెస్‍ను వేసుకుంది . ఈ నెక్లెస్ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ పోస్ట్ చేసిన ఫొటోలకు బ్యూటీ, రెడ్ హాట్ అంటూ చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ పిక్స్ మాత్రం సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తున్నాయి.

టాలీవుడ్ సినిమ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగినటువంటి రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం దక్షిణాది సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు ఇలా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి రకుల్ ప్రీతిసింగ్ బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిమితమయ్యారు. అక్కడ కూడా ఆమె నటించిన సినిమాలు కూడా పెద్ద విజయాలు అందుకోలేదు. ఒకానొక సమయంలో తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమెకు ఉన్నఫలంగా సినిమాలలో అవకాశాలు రాకపోవడానికి కారణం ఆమె స్నేహమేనని తెలుస్తోంది. రకుల్ బాలీవుడ్ బ్యూటీ రియా చక్రవర్తికి మంచి స్నేహితురాలుగా మారిపోయారు.వీరిద్దరు కూడా ఎంతో స్నేహంగా ఉండడంతోనే రకుల్ కెరియర్ పై కోలుకోలేని దెబ్బ పడిందని తెలుస్తుంది. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.