దర్శక దీరుడు రాజమౌళి తన కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క అపజయం ఎదుర్కొనలేదు. ఒటమెరుగని విక్రమార్కుడిలా తెలుగు సినిమా స్థాయిని ఉన్నత శిఖరాలలో నిలబెడుతున్నాడు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన జక్కన్న ఆర్ఆర్ఆర్ సినిమాతో దానిని రెట్టింపు చేశాడు. దేశ సినీ చరిత్రలో ఉన్న రికార్డ్స్ ను తిరగరాసేలా సినిమా తీయడం ఒక్క రాజమౌళికే చెల్లుతుంది అని చెప్పాలి.. క్రికెట్ వరల్డ్ కప్ అయిపోగానే మళ్ళీ ఎప్పుడో నాలుగేళ్ళకి కదా ఇంత పెద్ద పండుగ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా.. రాజమౌళి సినిమాల విషయంలో కూడా ప్రేక్షకులకు సేమ్ ఇదే ఫీలింగ్ ఉంటుంది.
రాజమౌళి తన రెండు దశాబ్దాల కెరీర్లో 12 చిత్రాలు మాత్రమే చేసి ఎవరూ అందుకోలేని రికార్డ్స్ సెట్ చేశారు.ఇకపోతే బాహుబలి 2 విడుదలై ఐదేళ్లు అవుతున్నా ఆ మూవీ కలెక్షన్స్ టచ్ చేసే సినిమా రాలేదు. రాజమౌళి సినిమాల రికార్డ్స్ రాజమౌళినే బ్రేక్ చేసుకునే పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు. ఆర్ ఆర్ ఆర్ మూవీతో మరికొన్ని రికార్డ్స్ నమోదు చేశాడు. అయితే ఆర్ ఆర్ ఆర్ వరల్డ్ వైడ్ రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కాగా యూఎస్ లో ఈ మూవీ 14 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది.
జక్కన్న తన సినిమాల్లో అప్పుడప్పుడు అథితి పాత్రలలో కనిపిస్తూ మెప్పిస్తుంటాడు. అయితే ఆయన తను దర్శకత్వం చేసే చిత్రంలోనే కాకుండా వేరే దర్శకుల చిత్రాల్లో కూడా అథితి పాత్రలలో కనిపిస్తూ ఉంటాడు. అలా డైరెక్టర్ రాజమౌళి, దర్శకుడు కోడి రామకృష్ణతో కలిసి రెయిన్ బో అనే చిత్రంలో అతిథి పాత్రలలో నటించారు. ఈ మూవీకి వి ఎన్ ఆదిత్య దర్శకత్వం వహించగా, అయితే ఈ చిత్రం ఎప్పుడు విడుదల అయిందో కూడా చాలా మందికి తెలియదు. ఈ సినిమా ప్లాప్ గా నిలిచింది. ఇప్పటి వరకు రాజమౌళి విజయవంతమైన చిత్రాలు మాత్రమే చేయగా, ఆయన అతిథి పాత్రలో నటించిన ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్ చిత్రాల లిస్ట్ లో చేరడంతో అభిమానులు కొంత నిరాశ చెందారు. ఇటీవలి కాలంలో రాజమౌళి అతిథి పాత్రలలో మెరిసిన చిత్రాలన్నీ మంచి విజయాలు సాధించాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…