Raghava Lawrence : సినీ నటుల్లో చాలా మంది సంపాదించుకునేవారే ఉంటారు. కానీ సహాయం చేసేవారు చాలా తక్కువగా ఉంటారు. కొందరు సినీ నటులు తమకు ఎంత తక్కువ సంపాదన ఉన్నా సరే సహాయం మాత్రం ఎక్కువగానే చేస్తుంటారు. అలాంటి వారిలో నటుడు, దర్శకుడు, డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ ఒకరని చెప్పవచ్చు. ఆయనకు ఇతరులతో పోలిస్తే పెద్దగా ఆస్తిపాస్తులు, ఆదాయం లేకున్నా సహాయం మాత్రం నిరంతరం చేస్తూనే ఉంటారు. ఇక ఆయన మరోమారు తన గొప్ప మనసు చాటుకున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
రాఘవ లారెన్స్ ఇటీవలే 13 మంది దివ్యాంగులకు బైక్స్ ఇస్తానని చెప్పి ఆ మాటను నిలబెట్టుకున్నారు. మొత్తం 13 స్కూటీలను కొని వాటిని త్రీ వీలర్‌లుగా మార్చి దివ్యాంగులకు ఇచ్చారు. దీంతో రాఘవ లారెన్స్ గొప్ప మనసును అందరూ ప్రశంసిస్తున్నారు. నెటిజన్లు ఆయనపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఇప్పుడే కాదు గతంలో రాఘవ లారెన్స్ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టారు.

ఇటీవలే ఒక మహిళకు ఆటోను కొనిచ్చారు. గతంలో కరోనా సమయంలో ఎంతో మందికి ఆర్థిక సహాయం అందించారు. అవసరమైన మందులను, వైద్య సామగ్రిని కొనిచ్చారు. అలాగే ఆక్సిజన్ ట్యాంకులను అందించారు. ఆ తరువాత కూడా ఎప్పటికప్పుడు ఆయన పేదలను ఆదుకుంటున్నారు. ఈ క్రమంలోనే నెటిజన్ల నుంచి ఆయన ప్రశంసలను అందుకుంటున్నారు. ఆయనను కొందరు దేవుడని పిలుస్తున్నారు.