Pushpa Spiderman : బాక్సాఫీస్ దగ్గర ఆసక్తికర పోటీ సాగుతోంది. ఈ వారం పుష్ప, స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ చిత్రాలు విడుదల కాగా, ఈ రెండు చిత్రాలు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. తెలుగు ప్రేక్షకులు హాలీవుడ్ చిత్రం స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ మూవీని కూడా చక్కగా ఆదరిస్తున్నారు. స్పైడర్ మ్యాన్.. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు చాలామంది ఇష్టపడే ఓ ఫిక్షనల్ క్యారెక్టర్. అందుకే స్పైడర్ మ్యాన్ సినిమాను ఎంతమంది ఎన్నిరకాలుగా తెరకెక్కించినా ప్రేక్షకులు వాటిని ఆదరిస్తూనే ఉన్నారు.
మూడో భాగమైన ‘స్పైడర్ మ్యాన్ నో వే హోమ్’ వాటికి మించిన రికార్డ్ స్థాయి కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. ఇది పుష్పకు గట్టిపోటీ ఇస్తోంది. భారీ హైప్‌తో డిసెంబర్ 16న విడుదలైంది స్పైడర్ మ్యాన్: నో వే హోమ్. టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ గా టైటిల్ రోల్ చేసిన ఈ మూవీ.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని సక్సెస్ సాధించి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రిలీజ్ అయిన 3 రోజుల్లోనే స్పైడీ మూవీ.. ఇండియాలో రూ.100 కోట్ల మార్కును దాటేసింది.
స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ ఇండియాలో గురువారం (డిసెంబర్ 16) ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో 3,264 స్క్రీన్‌లలో రిలీజైంది. ఈ చిత్రం శుక్రవారం మాత్రం అంతగా కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ఎందుకంటే అదే రోజున (డిసెంబర్ 17) ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ సినిమా ‘పుష్ప: ది రైజ్’ విడుదలే కారణం. అత్యధిక జనం పుష్పకు వెళ్లడంతో స్పైడర్ మ్యాన్ చిత్రానికి వసూళ్లు తగ్గాయి. పుష్ప సినిమాతో గట్టి పోటీ ఎదుర్కొన్న స్పైడీ శుక్రవారం రూ. 20.37 కోట్లు వసూలు చేయగా.. శనివారం మాత్రం రూ. 26.10 కోట్లు రాబట్టాడు. ఏదేమైనా ఈ రెండు గట్టిగా పోటీ పడుతుండడం విశేషం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…