Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పుష్ప’ మూవీ శుక్రవారం (డిసెంబర్ 17) విడుదలైన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ సాధించింది. పైరసీ బారిన పడిన కూడా మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం తొలి రోజు డివైడ్ టాక్ సొంతం చేసుకొన్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద వార్ వన్ సైడ్‌గా కనిపిస్తోంది.
ఆంధ్రాలో మినహాయించి విడుదలైన ప్రతీ చోట వసూళ్ల మోత మోగిస్తోంది. అయితే తొలి రెండు రోజుల్లో రికార్డు స్థాయి కలెక్షన్లు సృష్టించిన పుష్ప కోవిడ్ తర్వాత రిలీజైన చిత్రాల్లో అంటే 2021లో రికార్డు కలెక్షన్లను సాధించడమే కాకుండా ఓవర్సీస్‌లో అత్యధిక కలెక్షన్లను సాధించిన చిత్రంగా ఓ ఘనతతో వసూళ్ల జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్ర దర్శకుడు సుకుమార్ ఈ సినిమాకి కొనసాగింపుగా ప్లాన్ చేసిన రెండో పార్ట్ పై లేటెస్ట్ గా కొన్ని కీలక కామెంట్స్ చెయ్యడం వైరల్ అవుతోంది.
పుష్ప పార్ట్ 2 షూట్ వచ్చే ఏడాది మార్చి కానీ ఏప్రిల్ నుంచి కానీ స్టార్ట్ అవుతుందని అలాగే సినిమాలో అసలు కథ అంతా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుందని తెలిపారు. అలాగే ఫహద్ రోల్ కూడా ఈ సినిమా నుంచే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని, ఇంకొన్ని కీలక పాత్రలు కూడా అందులో యాడ్ అవుతాయని తెలిపారు. ఇదెప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…