వినోదం

Prakash Raj : మ‌ళ్లీ ‘మా’ ర‌చ్చ‌.. విష్ణు ప‌నితీరు ఈ రెండేళ్ల‌లో సున్నా అంటూ ప్ర‌కాశ్ రాజ్ కామెంట్స్

Prakash Raj : 2021లో జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఎంత ర‌చ్చ‌గా మారిందో చూశాం. విష్ణు, ప్ర‌కాశ్ రాజ్ లు ఎన్ని విమ‌ర్శ‌లు చేసుకున్నారో కూడా మ‌నం చూశాం. విష్ణు, ప్రకాష్ రాజ్ రెండు ప్యానల్స్ గా పోటీ చేసి ఒకరిపై ఒకరు విమర్శలు చేసి, ప్రచారాలు, హామీలు.. ఇలా సాధారణ ఎన్నికలు రేంజ్ లో జరిగాయి ‘మా’ ఎన్నికలు. ‘మా’ ఎన్నికలు వివాదంగా మారి కొన్ని రోజులు సాగింది. ఇక మంచు విష్ణు గెలవడానికి యాక్టివ్ గా లేని పాత హీరోయిన్స్, మెంబర్స్ ని కూడా ఎక్కడెక్కడ్నుంచో ఫ్లైట్స్ వేసి మరీ తెప్పించి ఓట్లు వేయించుకోవ‌డం మ‌నం చూశాం. అయితే పోటా పోటీగా జ‌రిగిన‌ ఎన్నికల్లో స్వల్ప తేడాతో మంచు విష్ణు గెలిచాడు.

మా ఎన్నిక‌ల స‌మ‌యంలో ఒకరి మీద ఒకరు వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేసుకునేంత వరకు వెళ్లారు, ప్రకాష్ రాజ్ ని మెగాస్టార్ చిరంజీవి , మెగా కుటుంబ సభ్యులు మద్దతు ఇచ్చి గెలిపించాల‌ని అనుకున్నారు. చాలా మంది ప్రకాష్ రాజ్ సునాయాసంగా గెలుస్తాడు అని అందరూ అనుకున్నారు కానీ, మంచు విష్ణు ఆశ్చర్యంగా అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. అయితే మా అధ్య‌క్షుడిగా ఎన్నుకోబ‌డ్డ త‌ర్వాత విష్ణు చేసింది సున్నా అంటూ ప్రకాశ్ రాజ్ తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మంచు విష్ణు తను ఎన్నికైన వెంటనే సొంత భవనం నిర్మాణానికి కృషి చేస్తాను అని అన్నాడు కూడా. మంచు విష్ణు ఎన్నికై రెండేళ్లు కావొస్తోంది, ఇప్పుడు మళ్ళీ మా కి ఎన్నికలు కూడా వచ్చేస్తాయి, అయితే ఈ సమయంలో ప్రకాష్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Prakash Raj

“రెండేళ్లు అయిపోయాయి, కనీసం ఒక జనరల్ బాడీ మీటింగ్ కూడా పెట్టలేదు, అలాగే మా కి సొంత భవనం కూడా లేదు, మంచు విష్ణు ఈ రెండేళ్లలో చేసింది ఏమీ లేదు సున్నా,” అని తెలిపారు. మీరు మళ్ళీ పోటీ చేస్తారా? అని అడగగా ప్రకాష్ రాజ్ సమాధానమిస్తూ.. హామీలు నెరవేరాయా లేదా అని ఓటు వేసిన వాళ్ళు అడగాలి. దొంగ ఓట్లు వేసిన వాళ్ళు ఎలాగో అడగలేరు. బయటి నుంచి ఫ్లైట్స్ వేసి తీసుకొచ్చిన వాళ్లకు సంబంధం లేదు. వీళ్ళు తెప్పించుకొని ఓటు వేయించుకొని పంపించారు. ఉన్నవాళ్లు అడగాలి. అలాగే ఏ పెద్దలైతే ఆయన వెనక ఉండి గెలిపించారో వాళ్ళ మనసాక్షికి వాళ్ళైనా అడగాలి. ఆయన్ని ఓడించి నిన్ను గెలిపించాం మరి ఏం చేయలేదు ఏంటి అని వాళ్ళైనా అడగాలి. నేను ఓడిపోయాను, తీర్పు పాటించి బయటకి వచ్చేసాను. ఓటు వేసినవాళ్లు అడగాలి. ఇప్పుడు మళ్ళీ పోటీ చేసేంత టైం నాకు లేదు. నాకు చాలా పనులు ఉన్నాయి అని అన్నారు ప్రకాశ్ రాజ్.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM