Prabhas : ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల వరదలు వచ్చి భారీ ఎత్తున నష్టం సంభవించిన విషయం విదితమే. ప్రజలు వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే తాజాగా పలువురు టాలీవుడ్ హీరోలు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు అందించారు. ఈ క్రమంలోనే వారి సరసన ప్రభాస్ చేరిపోయాడు.
రెబల్ స్టార్ ప్రభాస్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు భారీ విరాళం అందజేశాడు. ఏకంగా రూ.1 కోటిని విరాళంగా అందించాడు. ఇప్పటి వరకు ఎన్‌టీఆర్, చిరంజీవి, రామ్ చరణ్ తేజ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లు రూ.25 లక్షల చొప్పున విరాళాలు అందించగా.. వీరందరి కన్నా ప్రభాస్ ఎక్కువ విరాళం అందించడం విశేషం.
గతంలోనూ ప్రభాస్ ఇదేవిధంగా భారీ ఎత్తున విరాళాలు అందజేశాడు. కోవిడ్ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఇచ్చాడు. తరువాత తెలంగాణలో వచ్చిన వరదలకు సహాయం చేశాడు. గతంలో ఏపీలో వైజాగ్‌లో వచ్చిన హుదుద్ తుఫాన్‌కు బాధితులకు అండగా నిలిచాడు. ఈ క్రమంలోనే భారీ మొత్తంలో మరోమారు ప్రభాస్ విరాళాన్ని అందజేసి తన ఉదారతను చాటుకున్నాడు.
ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. పూజా హెగ్డెతో కలిసి రాధే శ్యామ్ లో నటిస్తుండగా.. ఈ మూవీ జనవరిలో విడుదల కానుంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో సలార్ అనే మూవీ చేస్తున్నాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…