Pooja Hegde : అలవైకుంఠపురం చిత్రంతో మంచి ఫేమ్ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ పూజా హేగ్దే.. తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని కైవసం చేసుకున్న ఈ భామ ఒకప్పుడు సూపర్ హిట్ చిత్రాలలో నటించి అలరించింది. ప్రస్తుతం పూజాకి తెలుగులో ఎలాంటి ప్రాజెక్ట్సు లేవు. కేవలం పలు హిందీ ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తోంది. పూజా బాలీవుడ్‌లో దేవా అనే సినిమాకు సైన్ చేసినట్లుగా సమాచారం. ఈ సినిమాలో షాహీద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ పనులు చకచకా సాగిపోతున్నాయి. ఇక, ఈ సినిమాను 2024 దసరాకి రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ డేట్‌ను కూడా ఫిక్స్ చేశారు.
తాజాగా పూజా హెగ్డేకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. పూజా హెగ్డేని చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయట. ఈ విషయాన్ని ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ అయిన వైరల్ భయాని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. పూజా హెగ్డే ఇటీవల దుబాయ్ కి వెళ్లడం జరిగింది. అప్పుడు ఆమె ఓ వివాదంలో చిక్కుకున్నట్టు భయాని చెప్పుకొచ్చాడు. ఈవెంట్ మేనేజర్‌తో పూజా హెగ్డే గొడవ పడగా, ఆ సమయంలో టైంలో పూజా హెగ్డేని చంపేస్తామని కొందరు బెదిరించారట. ఈ క్రమంలో భయపడిపోయిన పూజా హెగ్డే ఇండియాకి వచ్చేసిందని అంటున్నారు.
Pooja Hegde
అయితే ఈ వార్త కేవలం రూమరేనని కొందరు అంటున్నారు. ఈ విషయంపై బీటౌన్ మీడియా నటి పూజటీమ్‌ని సంప్రదించగా, ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని వారు చెప్పినట్లు బీటౌన్ వర్గాలు తెలియజేశాయి. అయితే, సోషల్‌మీడియాలో వైరల్ అయిన ఆ పోస్ట్‌ను కూడా డిలీట్ చేశారు. దీంతో ఈ న్యూస్ కేవలం రూమరే అని తేలిపోయింది. ఈ వార్త విన్న ఆమె అభిమానులు కాస్త ఊరట లభించింది. పూజా హెగ్డేకి ఇటీవల ప్లాప్ లు పెరగడంతో.. అవకాశాలుతగ్గుతూ వస్తున్నాయి. ఐరన్ లె్ గ అన్న పేరు పడటంతో.. పూజాహెగ్డే సాలిడ్ హిట్ కోసం ఎదరు చూస్తోంది. ఈక్రమంలో మహేష్ బాబుతో చేయబోయిన గుంటూరు కారం మూవీ నుంచి వెనక్క రావల్సి వచ్చింది. లైగర్ ఫెయిల్యూర్ తో.. విజయ్ దేవరకొండతో చేయాల్సి జనగనమణ సినిమా ఆగిపోయింది. ఆ రకంగా కూడా కలిసిరాలేదు బుట్టబొమ్మకి.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…