Pindam OTT : కంటెంట్ బాగున్న సినిమాలకి ఓటీటీలోను మంచి ప్రేక్షకాదరణ లభిస్తుంది. ఇక అందులోనూ హార్రర్ సినిమాలను ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. ఇటీవల కాలంలో లో 2023లోనే బిగ్గెస్ట్ హార్రర్ మూవీగా పిండం తెరకెక్కింది. అయితే ఈ సినిమా థియేటర్లలో ఎంత వణికించిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. హర్రర్ సినిమాల్లో ది బెస్ట్ హర్రర్ సినిమాగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఈసినిమాను నెట్‌ఫ్లిక్స్.. దక్కించుకుంది. న్యూ ఇయర్ 2024 జనవరి ఫస్ట్ వీక్‌లో.. స్ట్రీమింగ్ చేసేందుకు ఏర్పాట్లు కూడా చేస్తోంది. ఆ క్రమంలోనే తమ సోషల్ మీడియా హ్యాండిల్లో హింట్స్ ఇస్తోంది నెట్ ఫ్లిక్స్.
కళాహి మీడియా బ్యానర్‌పై హారర్ బ్యాక్ డ్రాప్ లో నిర్మించిన ఈ సినిమాకు సాయికిరణ్ దర్శకత్వం వహించాడు. శ్రీరామ్, ఖుషి రవి, ఈశ్వరీరావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. టీజర్, ట్రైలర్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. డిసెంబర్ 15 న రిలీజ్ అయింది. ఆడియెన్స్‌ను వణింకింది. హిట్ సినిమాగా హిస్టరీ కెక్కింది. నటుడు శ్రీరామ్ చాలా ఏళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా తాజా చిత్రం పిండం. ఈ చిత్రం మంచి వసూళ్లనే రాబట్టింది. ఓటీటీలో కూడా ఈ మూవీ అదరగొడుతుందని భావిస్తున్నారు.
చిత్ర కథ విషయానికి వస్తే…. ఆంథోని(శ్రీరామ్) ఓ రైస్ మిల్లులో అకౌంటెంట్ గా పని చేస్తుండగా…. అతని భార్య మేరి(ఖుషి రవి), ఇద్దరు కూతుళ్లు(సోఫియా, తార), తల్లి సూరమ్మతో కలిసి శుక్లాపేటలోని ఓ ఇంట్లో నివసిస్తూ ఉంటాడు. అయితే అది ఓ పురాతమైన ఇల్లు… తక్కువ ధరకు వస్తుందని భావించి ఆ ఇంటిని కొనుగోలు చేస్తాడు హీరో. అయితే ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత వారికి ఊహించని సంఘటనలు ఎదురు కాగా… వాటిని ఎలా ఎదుర్కొన్నాడు అనే కథంశంతో తెరకెక్కించారు. మీరు ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయితే కనుక ఓటీటీలో చూసేయండి. కానీ గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు ఈ సినిమాను చూడొద్దని సెన్సార్ బోర్డు ప్రకటించింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…