వినోదం

OTT Suggestion : థియేట‌ర్ల‌లో ఈ మూవీ ఫ్లాప్‌.. కానీ ఓటీటీలో మాత్రం సూప‌ర్ హిట్‌.. ఈ మూవీని మీరు చూశారా..?

OTT Suggestion : మ‌ళ‌యాళ యాక్ట‌ర్ టోవినో థామ‌స్ విభిన్న‌మైన పాత్ర‌ల‌ను చేస్తూ న‌టుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఓటీటీల పుణ్య‌మా అని ఈయ‌న మ‌ళ‌యాళ యాక్ట‌ర్ అయినా తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చేరువ అయ్యాడు. ఈయ‌న న‌టించిన సినిమాలు థియేట‌ర్ల‌లో పెద్ద‌గా ఆడ‌డం లేదు. కానీ ఓటీటీల్లో మాత్రం సూప‌ర్ హిట్ అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే తెలుగులో ఈ మూవీలు ఓటీటీలో మ‌రీ సూప‌ర్ డూప‌ర్ హిట్ అవుతున్నాయి. ఈయ‌న మూవీల‌ను ఓటీటీల్లో తెలుగు ప్రేక్ష‌కులు ఎక్కువ‌గా ఆద‌రిస్తున్నారు. ఇక ఈ మ‌ధ్యే ఈయ‌న నీల‌వెలిచ‌మ్ అనే మూవీలో న‌టించారు. ఈ మూవీ థియేట‌ర్ల‌లో నిరాశ‌ప‌రిచింది. కానీ ఓటీటీలో హిట్ అయింది.

నీల‌వెలిచ‌మ్ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. హార‌ర్ క‌థాంశంతో ఈ మూవీని తెర‌కెక్కించారు. థియేట‌ర్ల‌లో అంత‌గా ఆడ‌లేదు. కానీ ఓటీటీలో ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్‌ను అందుకుంటోంది ఈ మూవీ. ఇక అంత‌గా ఆక‌ట్టుకుంటున్న ఈ మూవీలో అస‌లు ఏముందో ఇప్పుడు చూద్దాం. టోవినో థామ‌స్ తెలుగు ఆడియన్స్‌కు ఓటీటీల వ‌ల్ల ప‌రిచితం అయ్యారు. ఇప్ప‌టికే ఎన్నో డ‌బ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఈయ‌న చేరువ అయ్యారు. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల వ‌చ్చిన ఈయ‌న మూవీ 2018 తెలుగులో మంచి క‌మర్షియ‌ల్ హిట్ అయింది. ఇక టోవినో న‌టించిన నీల‌వెలిచ‌మ్ మూవీ గ‌తేడాది ఏప్రిల్ 23వ తేదీన థియేట‌ర్ల‌లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఈ క్ర‌మంలోనే ఈ మూవీని గతేడాది మే 23న ఓటీటీలో రిలీజ్ చేశారు. అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయింది. అయితే ఓటీటీలో మంచి స్పంద‌న ల‌భిస్తుండ‌డం విశేషం.

OTT Suggestion

ఆషిక్ అబూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన నీల‌వెలిచ‌మ్ మూవీలో రిమా క‌ల్లింగ‌ల్‌, టామ్ చాకో, రోష‌న్ మాథ్యూ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. 1964లో రిలీజ్ అయిన విజ‌య‌నిర్మ‌ల మూవీ భార్గ‌వి నిల‌యం అప్ప‌ట్లో మ‌ళ‌యాళంలో హార్ర‌ర్ చిత్రాల‌కు ప్రేర‌ణ అయింది. 50 ఏళ్ల కింద‌ట మాలీవుడ్లో ఈ మూవీ ట్రెండ్‌ను సెట్ చేసింది. ఈ క్ర‌మంలోనే ఈ మూవీకి రీమేక్‌గా నీల‌వెలిచ‌మ్‌ను తెర‌కెక్కించారు.

ఇక సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే.. బ‌షీర్ (టోవినో థామ‌స్‌) ఒక ర‌చ‌యిత‌. స్టోరీ రాయ‌డం కోసం స‌ముద్ర తీరంలో ఉన్న ఒక ప‌ల్లెటూరికి వ‌స్తాడు. ఆ ఊరి చివ‌ర్లో ఉండే భార్గ‌వి నిల‌యం అనే పాత ఇంట్లో అద్దెకు దిగుతాడు. అయితే ఆ ఇంట్లో భార్గ‌వి అనే ఆత్మ ఉంద‌ని ఊర్లో వారు చెప్పుకుంటారు. వారిలో కొంద‌రు ఆ ఆత్మ‌ను కూడా చూస్తారు. ఆ ఇంట్లోకి ఎవ‌రు వ‌చ్చినా స‌హించ‌ని ఆత్మ అద్దెకు వెళ్లిన బ‌షీర్‌ను ఏమీ చేయ‌దు.

ఊర్లో వారు చెప్పే క‌థ‌లు విన్న బ‌షీర్ ఆమె మ‌ర‌ణం వెనుక ఉన్న నిజం తెలుసుకుని దాన్ని క‌థ‌గా రాయాల‌ని అనుకుంటాడు. ఈ క్ర‌మంలో క‌థ రాసే విష‌యంలో బ‌షీర్ కు ఎటువంటి సంఘ‌ట‌న‌లు ఎదుర‌య్యాయి, భార్గ‌వి ఎవ‌రు, ఆమె క‌థ ఏమిటి, అస‌లు ఎలా మ‌ర‌ణించింది, ఆమె బ‌షీర్‌ను ఎందుకు ఏమీ చేయ‌దు ? వ‌ంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు తెలుసుకోవాలంటే సినిమాను చూడాల్సిందే. ద‌ర్శ‌కుడు చిత్రాన్ని తెర‌కెక్కించిన తీరు ప్రేక్ష‌కుల‌కు విస్మ‌యాన్ని క‌లిగిస్తుంది. మంచి హార్ర‌ర్ చిత్రాన్ని చూడాల‌నుకునే వారు వీకెండ్‌లో ఈ మూవీని వీక్షించ‌వ‌చ్చు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM