NTR Watch : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు అనే విషయం తెలిసిందే. ఆయన ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారబోతున్నాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్‌కి సంబంధించిన ఏ విషయం అయినా ఇట్టే వైరల్ అవుతోంది. అంతేకాదు ఆయన ధరించే మాస్క్, బ్లేజర్, షూ, వాచ్‌ల గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. తాజాగా ఎన్టీఆర్ వాచ్‌కి సంబంధించిన వార్త ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.
రీసెంట్‌గా జరిగిన ప్రెస్ మీట్‌లో ఎన్టీఆర్ చేతికి ఉన్న వాచ్ ఒకటి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ వాచ్ ధర ఎంత అయి ఉంటుందా.. అని అందరూ ఆరాలు తీయగా, ఆ వాచ్ రేటు అక్షరాలారూ.4 కోట్లు అని తెలిసింది. నాలుగు కోట్ల రూపాయల వాచ్ ఏంటీ.. అని అనిపింస్తుంది కదా.. అవును రిచర్డ్ మిల్లే ఆర్ఎం 011 కార్బోన్ ఎన్టీపీటీ గ్రోస్జీన్ రోజ్ గోల్డ్ లోటస్ F1 టీం లిమిటెడ్ ఎడిషన్ వాచ్ ఖరీదు ఆన్ లైన్ లో 3 కోట్ల 99 లక్షల 32 వేల 392 రూపాయలుగా కనిపిస్తోంది.
ప్రపంచంలోనే అత్యధిక ఖరీదైన వాచ్‌లతో ఇది ఒకటి. ఈ బ్రాండ్‌లో లభించే ప్రతి వాచ్ చాలా ఖరీదైనదే. ఎన్టీఆర్ ఇష్టంతో ఈ వాచ్ కొనులుగోలు చేశాడట. ఇలాంటివి ఆయన దగ్గర మరో రెండు వాచ్ లు ఉన్నాయని సమాచారం. వాస్తవానికి ఎన్టీఆర్ కి కార్లు, వాచ్‌లు, దుస్తులు అంటే చాలా ఇష్టం. వాటికోసం కోట్లలో ఖర్చు చేస్తుంటారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న ఎన్టీఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…