Neha Sharma : ఇండస్ట్రీలో కొందరు ముద్దుగుమ్మలు అందాల ఆరబోతతో చేస్తున్న రచ్చ మాములుగా లేదు. సినిమా అవకాశాలు లేకపోయే సరికి కొందరు భామలు అందాలతో మత్తెక్కిస్తున్నారు. నెట్టింట ఎప్పటికప్పుడు గ్లామర్ డోస్ పెంచేస్తూ.. కుర్రకారుకు నిద్రపట్టకుండా చేసే భామలకు ఇండస్ట్రీలో కొదవేమీ లేదు. ఈ జాబితాలో ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది బీహారీ బ్యూటీ నేహా శర్మ . రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిరుత సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పింది. ఎంట్రీతోనే తన అందాలతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మంచి బ్రేక్ అందుకున్న ఈ భామ వరుణ్ సందేశ్ ‘కుర్రాడు’ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత తెలుగు సినిమాలకు దూరమైపోయింది.
తెలుగులో రెండు సినిమాల ఫ్లాప్ తర్వాత నేహా శర్మకి తెలుగులో పెద్దగా అవకాశాలు ఏమీ రాలేదు. దీంతో 2010 లో ‘క్రూక్’ అనే హిందీ సినిమాలో నటించింది. ఇక అప్పటి నుంచి హిందీ సినిమాలే ఎక్కువగా చేసిందీ బ్యూటీ. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్లీ విశ్వక్ సేన్ సినిమాతో మళ్లీ ఈ బ్యూటీ టాలీవుడ్ లో అడుగుపెట్టనుందని ఇటీవల ప్రచారం జరిగింది. విశ్వక్ సేన్ – రవితేజ ముళ్ళపూడి కాంబోలో వస్తున్న మూవీలో నేహా శర్మ ఓ కీలక పాత్రలో కనిపించనునందనే వార్త ఇప్పుడు టాలీవుడ్ లో జోరుగా వినిపిస్తోంది. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియదు కాని ఈ వార్త తెగ వైరల్ అయింది.

ఇక గ్లామర్‌తో మత్తెక్కించే నేహా శర్మ తన బర్త్ డే సందర్భంగా పిచ్చెక్కించింది. బీచ్ లో తన పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకొని అందుకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఓవైపు థైస్ షో, మరోవైపు క్లీవేజ్ షోతో నార్త్ బ్యూటీ రచ్చరంభోలా చేసింది. బర్త్ డే కాబట్టి కాస్త పద్దతిగానే కనిపించింది. అదే మాములు రోజులలో ఈ బ్యూటీ అందాలకి చిత్తైపోవడం ఖాయం. ఈరోజు నేహా శర్మ పుట్టిన రోజు కావడంతో ఆమె అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరింతగా కెరీర్ లో ముందుకు వెళ్లాలని ఆశిస్తున్నారు. ఈ ఏడాది అనుకున్న లక్ష్యాలని చేరుకోవాలని కోరుకుంటున్నారు.