Naga Chaitanya : అక్కినేని హీరో నాగ చైతన్య ఇటీవల కాలంలో సక్సెస్‌లు సరిగా అందుకోవడం లేదు. `కస్టడీ` మూవీ డిజాప్పాయింట్ చేసిన ఇప్పుడు అదే ఉత్సాంతో తండేల్ అనే చిత్రం చేస్తున్నారు. ఈ మూవీ గురించి సోషల్ మీడియాలో ఒకటే చర్చజరుగుతోంది. ఇప్పటికే తండేల్ అంటే.. నాయకుడని, సాహాస వీరుడు అని, రకరకాలుగా నిర్విచిస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు తన సినిమాకు అసలైన మీనింగ్ ఏంటో స్వయంగా తెలిపారు. తండేల్ అంటే గుజరాతీలో బోట్ ఆపరేటర్ అని అర్థం అని తెలిపాడు. గుజరాత్ పాకిస్థాన్ సరిహద్దుల్లోని కుగ్రామాల్లో తండేల్ అనే పదాన్ని వాడుతారట.
తండేల్ సినిమాలో నాగ చైతన్య.. గుజరాత్ సముద్రతీర జలాల్లో చిక్కుకున్న శ్రీకాకుళానికి చెందిన జాలరి పాత్రలో కనిపించనున్నారట. ఈ సినిమాను అల్లు అరవింద్ తన గీతా ఆర్ట్స్‌లో నిర్మిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సాయి పల్లవి హీరోయిన్‌గా చేస్తోంది. జాలర్ల జీవితాల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మరోవైపు నాగ చైతన్య `దూత` వెబ్ సిరీస్‌తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. డిసెంబర్ 1న ఇది అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇదొక క్రైమ్ థ్రిల్లర్. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది.

మరి కొద్ది రోజులలో విడుదల కానున్ననేపథ్యంలో ధూత ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ముంబయి, హైదరాబాద్, ఇతర ప్రధాన నగరాల్లో ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా డిజిటల్ ప్రమోటర్ నిహారిక.. నాగ చైతన్యని తెగ ఇబ్బంది పెట్టింది. దూత గురించి మాట్లాడుతున్న సమయంలో చెప్పే ప్రతి విషయానికి మధ్యలో అడ్డుపడుతుంది. తనకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించే పదాలు వస్తే వాటిని ప్రస్తావిస్తూ ఇరిటేట్ చేసింది. సినిమా ఆఫర్ ఇస్తానంటే సైలెంట్‌గా ఉన్న ఆమె తనకు నచ్చిన పదం రావడంతో మళ్లీ సేమ్ రియాక్షన్ ఇచ్చింది. ఇరిటేషన్ తట్టుకోలేక చైతూ చర్చని మధ్యలో ఆపి వెళ్లిపోయాడు. కన్వర్జేషన్‌లో సాగర్ అనే పాత్ర పోషించినట్టు చెప్పిన చైతూ జర్నలిస్ట్‌గా కనిపించనున్నట్టు పేర్కొన్నారు. సరదాగా చేసిన ఈ వీడియో అందరిని అలరించడంతో పాటు ధూతపై ఆసక్తిని కలిగించింది.