OTT : ఒకవైపు థియేటర్స్‌లో ప్రతి వారం కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేస్తుండగా, మరోవైపు ఓటీటీలో కూడా పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులని అలరిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఓటీటీ సంస్థలు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వీక్ సందడి చేసిన పలు చిత్రాలేంటో చూద్దాం. థియేటర్‌లో రిలీజ్ అవుతున్న సినిమాల విషయానికి వస్తే పాయల్ ముఖ్య పాత్రలో మంగళవారం అనే టైటిల్ తో నవంబరు 17న తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నటి హన్సిక ‘మై నేమ్ ఈజ్ శృతి’ కూడా నవంబరు 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే స్పార్క్ ది లైఫ్, సప్త సాగరాలు దాటి – సైడ్ బి…, అన్వేషి చిత్రాలు థియేటర్స్‌లో సందడి చేయనున్నాయి.
ఓటీటీ విషయానికి వస్తే.. నెట్‌ఫ్లిక్స్‌లో హౌటూ బికమ్ ఏ మాబ్ బాస్ (వెబ్‌సిరీస్) నవంబరు 14 నుండి స్ట్రీమింగ్ అవుతుంది. బెస్ట్ క్రిస్మస్ ఎవర్ (హాలీవుడ్) నవంబరు 16, ది క్రౌన్ (వెబ్‌సిరీస్) నవంబరు 16, బిలీవర్2 (కొరియన్) నవంబరు 17, ది డాడ్స్ (హాలీవుడ్) నవంబరు 17, సుఖీ (హిందీ) నవంబరు 17, ది రైల్వేమెన్ (హిందీ) నవంబరు 18 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఇక అమెజాన్ ప్రైమ్ లో ట్విన్ లవ్ (హాలీవుడ్) నవంబరు 17 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఇక డిస్నీ+హాట్‌స్టార్ లో అపూర్వ (హిందీ) నవంబరు 15 నుండి స్ట్రీమింగ్ కానుండగా, చిత్త (తమిళ/తెలుగు) నవంబరు 17, కన్నూర్ స్క్వాడ్ (మలయాళం) నవంబరు 17 నుండి స్ట్రీమ్ కానుంది.
బుక్ మై షోలో రాంగ్ ప్లేస్ (హాలీవుడ్)నవంబరు 12 నుండి స్ట్రీమింగ్ అవుతుంది. ది ఎగ్జార్సిస్ట్ (హాలీవుడ్) నవంబరు 17 నుండి స్ట్రీమ్ కానుండగా, జియో సినిమాలో ది ఫ్లాష్ (తెలుగు) నవంబరు 15 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఆపిల్ టీవీ ప్లస్ లో మోనార్క్(హాలీవుడ్) నవంబరు 17 నుండి స్ట్రీమ్ కానుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…