Mehreen Prizada : టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ మెహ్రీన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు వరుస సినిమాలతో సందడి చేస్తూ తన ఖాతాలో మంచి హిట్స్ వేసుకున్న ఈ అందాల ముద్దుగుమ్మకి ఇటీవల అవకాశాలు పెద్దగా రావడం లేదు. నాని నటించిన కృష్ణ వీర గాథ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది మెహ్రీన్. తొలి సినిమాతోనే నటనతో ఆకట్టుకుంది. ఎఫ్2, ఎఫ్ 3 చిత్రాలలో తన నటనతో ఆకట్టుకున్న మెహ్రీన్ టాలీవుడ్ లో కనిపించి చాలా కాలం అయ్యింది. ప్రస్తుతం మెహ్రీన్ హిందీలో సినిమాలు చేస్తోంది. అక్కడ వెబ్ సిరీస్ లోనూ నటిస్తుంది.కెరీర్ లో ముద్దుగా బొద్దుగా ఉన్న మెహ్రీన్… ఇప్పుడు సన్నజాజిలా మారిపోయింది.
సన్నగా మారిన తర్వాత మెహ్రీన్ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. కురచ దుస్తులలో అందాల ప్రదర్శన చేస్తూ మైండ్ బ్లాక్ చేస్తుంది.తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ అదరహో అనిపించేలా ఉన్నాయి. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్స్ తో సందడి చేస్తూ వస్తున్న హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా వాటి ప్రమోషన్స్ లో బిజీగా ఉంటూ వరుస ఫొటో షూట్స్ తో కూడా సందడి చేస్తుంది. తాజాగా మెహ్రీన్ చేతులు పైకెత్తి మరీ ఘాటుగా ఫోజులిస్తూ కుర్ర గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేసింది. లెహంగాలో ఈ అమ్మడు క్యూట్ అందాలు మైండ్ బ్లాక్ అనిపిస్తున్నాయి. మెహ్రీన్‌ని ఇలా చూసి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. రోజురోజుకి మెహ్రీన్ గ్లామర్ పెరిగిపోతుందిగా అని కామెంట్ చేస్తున్నారు.

మెహ్రీన్ ని చాలా మంది లేఖ అని పిలుస్తూ ఉంటారని మెహ్రీన్ చెపుతోంది. స్పార్క్ అనే సినిమాలో లేఖ అనే పాత్రలో నటిస్తోంది మెహ్రీన్. ఈ సినిమా తనకు లైఫ్ టైమ్ గుర్తింపు తెచ్చిపెడుతుందని భావిస్తోంది ఈ అమ్మడు. స్పార్క్ మూవీలో తాను లేఖ అనే పాత్రలో నటిస్తున్నానని.. ఇది సినిమాలో ఎంతో ఇంపార్టెంట్ రోల్ అని… సినిమా నాతోనే స్టార్ట్ అవుతుంది.. నాతోనే ఎండ్ అవుతుందని కూడా మెహ్రీన్ తెలిపింది. ఆ సినిమా తర్వాత ఇకపై తనను లేఖ అని పిలుస్తారని మెహ్రీన్ కాన్ఫిడెంట్‌తో చెపుతోంది. మెహ్రీన్ లేటెస్ట్ ఫిల్మ్ ‘స్పార్క్ లైఫ్’ రెండ్రోజుల కిందనే విడుదల మంచి టాక్ నే సొంతం చేసుకుంది. అంతకముందు ‘సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ’ సిరీస్ తో బోల్డ్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టింది.